JAISW News Telugu

Tellam Venkat Rao : రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..

FacebookXLinkedinWhatsapp
BRS MLA-CM Revanth

Tellam Venkat Rao

Tellam Venkat Rao : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కలిశారు. వెంకట్రావు కుటుంబ సభ్యులతో వెళ్లి రేవంత్ ను కలిశారు. ఆదివారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వెంకట్రావు కుటుంబ సమే తంగా సీఎంతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాపూర్వకంగానే కలిసినట్లు వెంకట్రావు చెప్పారు. భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల చేయాలని రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎంను ఆయన కలవడం ఇది రెండోసారి. వెంకట్రావు త్వరలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యం లోనే ఆయన ఫ్యామిలీతోపాటు సీఎంను కలువ డంతో చర్చకు దారి తీసింది. అయితే వెంకట్రావు హస్తం గూటి చేరడం ఖాయంగా కనిపి స్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ లో చేరారు. వారికి బీజేపీలో టికెట్ కూడా వచ్చిం ది. రాములు బదులుగా ఆయన కొడుకు భరత్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇక పెద్దపల్లి ఎంపి వెంకటేశ్ బీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ కు గుడ్ బాయ్ చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు.

వారంతా మార్యదపూర్వకంగానే రేవంత్ రెడ్డిని కలిసినట్లు చెబుతున్నా.. అందులో కొంత మంది గోడ దూకెందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వారంతా హస్తం గూటికి చేరే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిని పర్సనల్ గా కలవొద్దని.. ప్రజాక్షేత్రంలోనే కలవాలని చెప్పినా.. పలువులు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని పర్సనల్ గా కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నిక ల్లో బీఆర్ఎస్ పార్టీ గడ్డుకాలమే ఎదురయ్యే అవకాశం ఉంది.

Exit mobile version