KTR BRS:తెలంగాణ భవిష్యత్తుపై కేటీఆర్ సంచలన ట్వీట్
KTR BRS:కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సమరానికి సై అంటోందా?.. ఇక తమ వైపు నుంచి కూడా ఆట మొదలు పెట్టబోతోందా? అంటే తాజా పరిణామాలని పరిశీలిస్తే నిజమేనని స్పష్టమవుతోంది. ఇటీవల గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే క్రమంలో అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్ పై సీఎం రేవంత్‌రెడ్డి ..రేవంత్‌పై కేటీఆర్ మాటల దాడికి దిగడం..అది ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడం వరకు వెళ్లడం అసెంబ్లీని హీటెక్కించింది.
ఇదిలా ఉంటే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి షేర్ చేసిన ట్వీట్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. `ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో అన్నాం అనుకోండి. అది ఇస్తాం ఇది ఇస్తాం అంటాం. అంత మాత్రాన అన్నీ ఫ్రీ గా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు` అంటూ కర్ణాటక అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంటున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోని షేర్ చేసిన కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉండోతోందా? అంటూ ప్రశ్నించారు. సాధ్యంకాని కపట వాగ్ధానాలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. ఏమాత్రం పరిశోధన చేయకుండా మోసపూరిత వాగ్ధానాలను ఎలా ఇస్తామరి ఫైర్ అయ్యారు. ఎలాంటి ప్లానింగ్ లేకుండానే ఇలాంటి విపరీతమైన వాగ్ధానాలు ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు అయ్యాక ఇదే ప్రకటన రేవంత్ రెడ్డి కూడా చేయనున్నారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
No money to deliver poll promises/guarantees says Karnataka CM !
Is this the future template for Telangana too after successfully hoodwinking the people in elections ?
Aren’t you supposed to do basic research and planning before making outlandish statements? https://t.co/JOcc4NLsiq
— KTR (@KTRBRS) December 19, 2023