BRS Strategy : బెడిసికొట్టిన బీఆర్ఎస్ నేత వ్యూహం
BRS Strategy : తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ తన తెలివితేటలను ప్రదర్శించారు. ఉద్యమం కాబట్టి తప్పలేదు. ఉద్యమం పేరు తన ఒక్కడికే దక్కాలనే ఆశతో నాయకులందరికీ తెలంగాణ ఆశ చూపించారు. తెలంగాణ సాధించుకుంటే మనకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. మన పరిపాలన మనమే చేసుకోవచ్చు అని ఆశలు కల్పించారు. వివిధ పార్టీలల్లో ఉన్న పెద్ద, పెద్ద నాయకులు సైతం కేసీఆర్ మాటలు నమ్మి అప్పటి టిఆర్ఎస్ లో చేరారు. ఎట్టకేలకు ఆ పార్టీ , ఈ పార్టీ అనే తేడా లేకుండా అందరూ కలిసి తెలంగాణ సాధించు కున్నారు. అదే తెలివి తేటలతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ఎత్తులు వేశారు కేసీఆర్. కన్న కూతురు కోసం వేసిన ఎత్తులు చిత్తు కావడంతో కేసీఆర్ ఆత్మ పరిశీలనలోకి వెళ్లక తప్పలేదు.
కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కున్న విషయం విదితమే. కవిత జైలు కు వెళ్లడం ఏనాటికైనా తప్పదు అనే విషయం కేసీఆర్ కు తెలుసు. రాజకీయంగా రెండు దఫాలుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అటువంటి నాయకుడి కూతురు జైలు కు వెళితే ఎంత అవమానమో చెప్పాల్సిన పని లేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూతురును కాపాడుకోలేని అసమర్దుడిగా పేరు తెచ్చుకోవడం కేసీఆర్ కు ఇష్టం లేదు. ఎంతయినా ఉద్యమ తెలివి తేటలు ఉన్న నాయకుడు. కూతురు కోసం బీజేపీ ని ఇరుకున పెట్టి కవితను కాపాడుకోవాలని ఓ పాచిక వేశారు కేసీఆర్. ఆ పాచిక బెడిసికొట్టింది. కవిత జైలకు వెళ్ళక తప్పలేదు.
కొత్తగా ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ కేసీఆర్ ఓ పుకారు తీసుకువచ్చారు. బీజేపీ తన ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తోంది. అందుకు మధ్యవర్తిగా జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ ను ఏర్పాటు చేసిందని, ఇది రాజకీయ కుట్ర అంటూ తన పలుకుబడితో కేసు నమోదు చేయించాడు. బిఎల్ సంతోష్ అరెస్ట్ అయితే బీజేపీ నాయకులు దిగివస్తారని ఆలోచించారు. ఢిల్లీ పెద్దలు అంత తెలివి లేనివాళ్లు కాదు కదా. కేసీఆర్ ఎత్తుకు పై ఎత్తు వేసి ఎలా తప్పించుకోవాలో అలా తప్పించుకున్నారు. కానీ కవిత జైలు కు వెళ్ళాక తప్పలేదు. ఇటీవల రాష్ట్రంలో ప్రకంపనలు లేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ విషయాలు బయటకు రావడం విశేషం. మాజీ డీసీపీ రాధాకిషన్ రావ్ సంబంధిత అధికారుల విచారణలో ఈ కేసీఆర్ వేసిన ఎమ్మెల్యేల కొనుగోలు నాటకానికి సంబందించిన విషయాలు వెల్లడించారు.