BJP-BRS : తెలంగాణలో బీజేపీ కంటే బీఆర్ఎస్ బలహీనం!

BRS is weaker than BJP in Telangana!

BRS is weaker than BJP in Telangana!

BJP-BRS : అసెంబ్లీ ఎన్నికలు రెండు  నెలల ముందే ముగియడంతో లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ సిద్ధమవుతోంది. ఎంపీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ కు సహజంగానే ఎడ్జ్ ఉంటుంది కానీ బీజేపీ, బీఆర్ఎస్ వంటి ఇతర పార్టీల పరిస్థితి ఏంటి? టైమ్స్ నౌ మ్యాట్రిజెస్ ఒపీనియన్ పోల్ ను ఇటీవల ప్రకటించింది.

టైమ్స్ నౌ ఒపీనియన్ పోల్ వివరాల ప్రకారం.. తెలంగాణలో బీజేపీ కంటే బీఆర్ఎస్ బలహీనంగా ఉంది. ఏజెన్సీ సమర్పించిన గణాంకాలు ఇలా ఉన్నాయి.

టైమ్స్ నౌ తెలంగాణ ఒపీనియన్ పోల్ 2024
కాంగ్రెస్ : 09
బీజేపీ : 05
బీఆర్ఎస్ : 02
ఎంఐఎం : 01

2019 లో బీఆర్ఎస్ తొమ్మిది ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈ వారం ఎంపీ వెంకటేష్ నేత పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడంతో ఆ తొమ్మిది ఎంపీలలో ఒకరిని కోల్పోయారు. కనీసం 8 ఎంపీ స్థానాలను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా, టైమ్స్ నౌ మ్యాట్రిజెస్ ఒపీనియన్ పోల్స్ సర్వేలో అందుకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. కేవలం 2 ఎంపీ స్థానాలకు పడిపోవడం బీఆర్ఎస్ వినాశనానికి నాందీ అంటూ వాదనలు వినిపిస్తున్నాయి.

కానీ, బీఆర్ఎస్ అంత తేలిగ్గా పోటీలోంచి బయటపడుతుందని అనుకోలేం. 13న నల్లగొండలో భారీ బహిరంగ సభకు కేసీఆర్ పిలుపునిచ్చారు, లోక్‌సభ ఎన్నికలకు ముందు మరి కొన్ని వారాల్లో ఇలాంటి బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీలో టాక్ వినిపిస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకునేందుకు శక్తి మేర కృషి చేస్తుంది.

మరోవైపు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. బీజేపీ కూడా లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని చూస్తోంది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎంపీ ఎన్నికల్లో మెరుగైన గణాంకాలను నమోదు చేయడం బీఆర్ఎస్ కు అంత సులువు కాదు.

TAGS