CM Revanth Reddy : ప్రజలు శిక్షించినా.. బీఆర్ఎస్ మారలేదు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy
CM Revanth Reddy : ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో సీఎం గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేవుడు మీకు మంచి బుద్ధి ప్రసాదించుగాక అని మాత్రమే ప్రార్థించగలమన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని, అందుకు కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పంచాయతీలుగా మారిన తండాకు రోడ్డు మార్గం లేదన్నారు. అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తామని తెలిపారు. తండాలకు 100 శాతం రోడ్లు వేయాలని నిర్ణయించామన్నారు. తండాలు, గూడాల్లో అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి అన్నారు. ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారలేదని విమర్శించారు.