BRS : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న అంశంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా అన్ని పార్టీలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఈ క్రమంలో అధికారపక్షానికి ప్రతిపక్ష నేతలకు మధ్య మాటల యుద్ధం నడిచింది. చివరికి సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది.
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్.. ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తామేమి ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ సంపదను తమ రాష్ట్రానికి కేటాయించాలని కోరలేదన్నారు. కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ నుంచే అధిక మొత్తంలో నిధులు వెళుతున్నా.. తెలంగాణకు మాత్రం కేంద్రం మొండి చేయి చూపుతుందన్నారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27న జరగనున్న నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు రేవంత్ కీలక ప్రకటన చేశారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణలో మోడీ పర్యటన సందర్భంగా ప్రధానిని రేవంత్ బడేభాయ్ అని రేవంత్ సంబోధించారని బీఆర్ ఎస్ ఆరోపించింది. ఈ అసెంబ్లీ సమావేశంలోనూ బీఆర్‌ఎస్ ఇదే అంశాన్ని లేవనెత్తింది. శాసనసభలో కేంద్రం వైఖరిపై చర్చ సందర్భంగా ప్రధానిపై రేవంత్ చేసిన విమర్శలు బీఆర్‌ఎస్ ఆరోపణల్లో నిరాధారమని తేలింది. ఇప్పుడు బీఆర్‌ఎస్ కు బీజేపీతో స్నేహం లేదని నిరూపించుకోవాల్సి ఉంది. గత కొంతకాలంగా బీజేపీని విమర్శించే సాహసం ఆ పార్టీ చేయడం లేదు.
కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేసినా రేవంత్ ను కూడా అందులోకి లాగారు. చోటేభాయ్‌కి బడేభాయ్ బహుమతి ఇచ్చారని రేవంత్ రెడ్డిని విమర్శించారు. అసెంబ్లీలో తన ప్రసంగంతో రేవంత్ తనపై వచ్చిన ఆరోపణలను తన ప్రసంగం ద్వారా నోరు మాయించారు. కానీ, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనే పొత్తు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. కమలంతో తమకు ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేయాల్సిన బాధ్యత గులాబీ పార్టీపై ఉంది. మరి దీనికి బీఆర్‌ఎస్ ఏం చేస్తుందో చూడాలి.