JAISW News Telugu

Chandruda Rara Song : ‘చంద్రుడా రారా’ కాపీ కొట్టిన బీఆర్ఎస్! సాంగ్ పై నెట్టింట్లో దుమారం..!

Chandruda Rara Song

Chandruda Rara Song, Chandrababu and KCR

Chandruda Rara Song : తెలంగాణ ఉద్యమ ద్రోహిగా చంద్రబాబు నాయుడిని ధూషించిన కేసీఆర్ ఆయన పాలనననే కాదు ఆయన పాటలను కూడా కాపీ కొడుతున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు మద్దుతుగా టీడీపీ రిలీజ్ చేసిన పాపులర్ సాంగ్ ‘చంద్రుడా రారా’ను తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ వాడుకుంటున్నారు. ఈ పాటను 2019 ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని రూపొందించింది. ఇది చంద్రబాబు పునరాగమనం కోసం, ఆయన వేసిన ప్రగతికి మెట్లను వివరిస్తూ ఆలపించింది.

బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలివిగా ఆ పాటను తమ నాయకుడు కే చంద్రశేఖర్ రావు కోసం కాపీ కొట్టారు. ఇద్దరు నాయకులకు ‘చంద్ర’ అనే పదంతో వారి పేర్లు మొదలు అవుతున్నాయి. దీంతో ఈ పాటను ఇక్కడ కూడా ఉపయోగించుకోవచ్చని కేసీఆర్ అనుకున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ పాటను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో బీఆర్ఎస్ విరివిగా వాడుకుంటుంది.

లిరిక్స్ ఇద్దరు నేతలకు సరిపోయేలా ఉండడం కేసీఆర్ కు కలిసి వచ్చే అంశం. సహజంగానే బీఆర్ఎస్ నేతలు దీన్ని బాగానే ఉపయోగించుకుంటూ ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ బహిరంగ సభలు, భారీ సభలతో ఆయన సంభాషణలతో విజువల్స్ నిండిపోయాయి. ‘నవ్యాంధ్ర’పై చివరి లైన్ మినహా బ్యాలెన్స్ సాంగ్ ను యథాతథంగా కాపీ కొట్టారు. తమ నాయకుడి పాటను మీ నాయకుడిపై పాడుకోవడం ఏంటని  టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

సినిమాల్లో మాదిరిగా కాపీ రైట్స్ ఉండకపోవచ్చు గానీ.. ఒక్క పాటను డిజైన్ చేసుకోలేకపోతున్నారన్న అపవాదు మాత్రం బీఆర్ఎస్ పార్టీ మోస్తోంది. చంద్ర కామన్ గా ఉన్నంత మాత్రాన మొత్తం పాటను కాపీ కొట్టడం మంచిది కాదని తెలుగు దేశం పార్టీ కేడర్ అంటుంది.

Exit mobile version