BRS Candidate : చంద్రబాబుపై బీఆర్ఎస్ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు

BRS Candidate
BRS Candidate : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గనుక చంద్రబాబు గెలిస్తే తన శిష్యుడితో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేస్తాడని అన్నారు. వినోద్ కుమార్ కరీంనగర్ లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
‘‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు దగ్గర పడింది. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకొని హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తాడు. బీజేపీ ఆలోచనలు కూడా హైదరాబాదును కేంద్ర పాలిన ప్రాంతంగా మారా్చలన్నట్లుగానే సాగుతున్నాయి. పార్లమెంట్ లో గళం విప్పాలంటే నేను గెలవాలి. బండి సంజయ్ బీజేపీ కూర్చోమంటే కూర్చొంటాడు.. లెమ్మంటే లేచే వ్యక్తి’’ అని వినోద్ కుమార్ మండిపడ్డారు.
TAGS BJPBRSBRS CandidateBRS MP Candidate Vinod KumarChandrababuCM RevanthCongressHyderabadHyderabad joint capitalkarimnagar MP candidate