Mahipal Reddy Campaign 2023 : తెలంగాణలో ఎన్నికల ప్రచార వేడి సాగుతోంది. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఊపు మీదున్నారు. సీఎం కేసీఆర్ విధానాలు మాకు గెలుపు అస్త్రాలుగా నిలుస్తాయని నమ్ముతున్నారు. దీంతో రాష్ట్రంలో మళ్లీ వచ్చేది గులాబీ ప్రభుత్వమేనని చెబుతున్నారు. ప్రచార హోరు పెంచారు. ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
పటాన్ చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రచార జోరు కొనసాగిస్తున్నారు. గడపగడపకు వెళ్లి ఓటు వేయాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ తోనే డెవలప్ మెంట్ సాధ్యమని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నారు. పటాన్ చెరులో మహిపాల్ రెడ్డి తన ప్రతాపం చూపిస్తున్నారు. గడపగడపకు తిరుగుతూ ఓట్లు అర్థిస్తున్నారు.
మహిపాల్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇతరులకు భిన్నంగా తిరుగుతున్నారు. ఎటు చూసినా గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. దీంతో ఆయన గెలుపు సునాయాసమే అనే వాదనలు వస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇక్కడ గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమని తెలుస్తోంది.
రోజుకో తీరుగా ప్రచారం చేస్తున్నారు. కాలినడకన వెళ్తున్నారు. వాహనాల ర్యాలీ తీస్తున్నారు. మహిళలు, ఒగ్గు కళాకారులతో సందడి చేస్తున్నారు. పటాన్ చెరు మొత్తం హోరెత్తిస్తున్నారు. కేసీఆర్ పథకాలే గట్టెక్కిస్తాయని బలంగా నమ్ముతున్నారు. దీని కోసమే నిరంతరం ప్రచారం చేస్తున్నారు. మహిపాల్ రెడ్డి హవా కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు నామమాత్రంగానే ఉంటున్నాయి.