JAISW News Telugu

Surrendered : పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు

Surrendered

Surrendered

Surrendered : మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని క్రిస్టియన్ పల్లి శివారు సర్వే నెం.523లో ఉన్న ప్రభుత్వ భూమిని తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, సంతకాలతో ప్లాట్లుగా చేసి విక్రయాలు జరిపిన వ్యవహారంలో మొత్తం నలుగురిపై మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు రెండు నెలల క్రితం కేసులు నమోదు చేశారు. ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.

మరో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా తన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ ను తన వాహనంలో తీసుకొచ్చి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద దించారు. కాగా, శ్రీకాంత్ గౌడ్ లొంగిపోతున్న విషయం తెలుసుకొని పలవురు బీఆర్ఎస్ నాయకులు రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి శ్రీకాంత్ గౌడ్ ను కలిసి పలు అంశాలపై చర్చించారు.

Exit mobile version