Jagan-Sharmila Debts : అన్నా, చెల్లెలు అప్పు హాట్ టాపిక్

Jagan-Sharmila Debts

Jagan-Sharmila Debts

Jagan-Sharmila Debts : పుట్టింటివారు ఆడబిడ్డకు ఇచ్చేది ఏదయినా పసుపు,కుంకుమ కింద ఇస్తారు.ఇంకా చెప్పాలంటే బహుమతి రూపంలో ఇస్తారు.కానీ తాను పుట్టింటి నుంచి అప్పుతెచ్చుకున్నానని ఆమె అన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పై మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోకసభ స్తానం నుంచి పోటీచేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్ వేసిన సందర్బంగా అఫిడవిట్లో తన ఆస్తులు,అప్పులు,నగదు,రాబడి వంటి వివరాలను అందులో పొందుపరిచారు.తాను తన అన్న జగన్ వద్ద 82 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నట్టు వెల్లడించింది. అదేవిదంగా జగన్ భార్య,తన వదిన భారతి రెడ్డి నుంచి కూడా 19 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నట్టు తన అఫిడవిట్లో షర్మిల పేర్కొంది.

అన్న,చెల్లెలు మధ్య అప్పులు ఏమిటి, ఈ అప్పులు తీసుకున్న విషయం ఎంతవరకు నిజం.అఫిడవిట్ లో షర్మిల తన అన్న,వదిన వద్ద తీసుకున్న అప్పు నిజమైనదేనా అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. చెల్లెలు కు జగన్ అప్పులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని కూడా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.జగన్ కు సొంత చెల్లెలు అయిన షర్మిలకు అప్పు ఇవ్వడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పుట్టింటి నుంచి షర్మిలకు ఇవ్వాల్సిన వాటా జగన్ పద్దతి ప్రకారం ఇవ్వలేదనేది షర్మిల మాటలతో తెలిసిపోయింది.తన ఎన్నికల నామినేషన్ పత్రంలో షర్మిల చూపించిన అప్పుల విషయంతో నిజా,నిజాలు బయటకు వచ్చాయి.జగన్ తన చెల్లెలుకు వాటా రూపంలో ఏమి ఇవ్వలేదనేది తెలిసిపోయింది. అందుకే ఇద్దరిమధ్య మాటలు లేకుండా పోయింది.తల్లి జయమ్మ కూడా ఎవరివైపు మాట్లాడలేకపోతున్నదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవల షర్మిల కొడుకు పెళ్ళికి జగన్ వచ్చి దంపతులను ఆశీర్వదించినప్పటినికిని అన్నా, చెల్లులు మాట్లాడుకోలేదు. జగన్ భార్య భారతి రెడ్డి కూడా అంటీముట్టనట్టే ఉంది.కాబట్టి ఆస్తుల పంపకాల విషయాలలోనే అన్నా,చెల్లెలు మధ్య తేడాలు రావడంతోనే మాటలు దూరం అయినాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.రాజకీయ వర్గాల్లో కూడా ఈ అప్పుల విషయం బయటకు పొక్కడంతో ఇదంతా ఒక నాటకమేనని కొట్టి పారేస్తున్నారు.

TAGS