Viral Video : చంద్రబాబును పొగడడానికి అన్నాచెల్లెళ్లు తెగ పోటీపడుతున్నారుగా..

Jagan-Sharmila Viral Video
Viral Video : ఏపీలో టీడీపీ కూటమి దూసుకెళ్తోంది. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు, మరో వైపు జనసేనాని పవన్ కల్యాణ్.. భారీ బహిరంగ సభలతో మోదీ, అమిత్ షా..వీళ్లందరి టార్గెట్ జగనే. కూటమి దూకుడుతో జగన్ రెడ్డికి ముచ్చెమటలు పడుతున్నాయి. రెండు నెలల కిందటి దాక 175 టార్గెట్ అంటూ ప్రగాల్భాలు పలికిన జగన్ కు ప్రస్తుత పరిణామాలతో ఓటమి ఖాయమని అర్థమైపోయి ఉంటుంది. దీంతో ఆయనకు కలలో కూడా చంద్రబాబే కనిపిస్తున్నాడు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ విషయాన్ని చంద్రబాబుకు ముడిపెట్టడంతోనే అర్థమవుతోంది జగన్ కు చంద్రబాబు ఫీవర్ ఎంత పట్టిందో.
చంద్రబాబు తన చెల్లెలితో తనపై పోరాటానికి పంపించారని..రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కూడా చంద్రబాబు చెప్పినట్టే నడుచుకుంటున్నాయని, అఖరికి మోదీ కూడా చంద్రబాబు చెప్పినట్టే నడుచుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. అసలు చంద్రబాబు పేరు లేకుండా జగన్ మాట్లాడే పరిస్థితి లేదు. చంద్రబాబు ఎంత శక్తివంతుడో జగనే జాతీయ మీడియాకు చెప్పేస్తున్నాడు. చంద్రబాబును ‘మహా బాహుబలి’గా చేస్తుండడాన్ని బట్టే జగన్ ఓటమి వైపు పయనిస్తున్నట్టు అర్థమవుతోంది.
జగన్ జాతీయ మీడియా ఇంటర్వ్యూ తర్వాత ఆయన చెల్లి షర్మిల ఓ తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ జగన్ కు కౌంటర్ ఇచ్చారు. జగన్ మానసిక పరిస్థితి బాగా లేదన్నారు. జగన్ కు అద్దంలో కూడా చంద్రబాబే కనిపిస్తున్నారని చెప్పుకొచ్చింది. తనను, సునీతను కూడా చంద్రబాబే నడిపిస్తున్నారని అంటున్నారని, వాస్తవానికి చంద్రబాబును బలవంతుడిని చేసిందే జగన్ అని ఎద్దేవా చేసింది.
అన్నాచెల్లెళ్ల ఇంటర్వ్యూలను చూసిన ఏపీ ప్రజలకు చంద్రబాబుపై మరింత గౌరవం పెరిగిపోయింది. ప్రత్యర్థులే చంద్రబాబును అంతగా పొగుడుతున్నారంటే ఆయన వ్యక్తిత్వం, పనితనం, రాజకీయ చాణక్యం అలాంటిది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. పాలనలో చంద్రబాబే సమర్థుడు అని. అందుకే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించుకుని మరోసారి సీఎంగా చూసుకోవాలని జనాలు ఫిక్స్ అయిపోయారు.