JAISW News Telugu

Britain : భారతీయ యువతకు బ్రిటన్ గుడ్ న్యూస్- 3 వేల మందికి..!

Britain Good News

Britain 

Britain Good News : భారత్ నుంచి ఉన్నత విద్యాభ్యాసం, ఉద్యోగాలు, లేదా నివసించడానికి బ్రిటన్ వెళ్లాలనుకునే యువ తకు వీసాలు జారీ చేసందుకు అక్కడి ప్రభుత్వం ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ పథకాన్ని తీసుకొ చ్చింది. దీని ప్రకారం ఏటా 3 వేల మంది యువత కు వీసాలు జారీ చేస్తారు. ఈ పథకానికి తొలి విడ త దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. ఇం దులో దరఖాస్తు చేసుకున్న వారికి రెండేళ్ల పాటు ఉండేలా వీసా అందిస్తారు.

భారత్-బ్రిటన్ మధ్య సంబంధాలను మరింత పెం పొందించే విధంగా అక్కడి రిషీ సునాక్ సర్కార్ తాజాగా ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా భారతీయ యు వతకు బ్రిటన్ లో చదువుకోవడానికి, పని చేయడా నికి లేదా నివసించడానికి ప్రత్యేక అవకాశాన్ని కల్పి స్తున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందు కు వీలుగా ఫస్ట్ బ్యాలెట్ ను మధ్యాహ్నం రెండు న్నర గంటలకు విడుదల చేశారు. ఫిబ్రవరి 22 వరకూ ఈ పథకం కింద దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ పథకానికి దరఖాస్తుదారులు దరఖాస్తు ప్రక్రియ సమయంలో పేరు, పుట్టిన తేదీ, పాస్‌పోర్ట్ డేటా, స్కాన్ చేసిన పాస్‌ పోర్ట్ ఫోటో, ఫోన్ నంబర్, ఇమెయిల్ అడ్రస్ సహా ప్రాథమిక సమాచారాన్ని తప్పనిసరిగా సమర్పిం చాలి. అలాగే ఈ పథకానికి దరఖాస్తుదారులు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల భా రతీయ పౌరులై ఉండాలి.

దీంతో పాటు బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగి ఉండటం, బ్రిటన్ లో నివసించడానికి ఖర్చు చేసేందుకు £2,530 (దాదా పు రూ. 2,64,302) మొత్తం కలిగి ఉండాలి. ఈ పథకానికి ఎంపికైన దరఖాస్తు దారులు బ్రిటన్ వెళ్లేటప్పుడు తమతో పాటు 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లల్ని తీసుకెళ్లి నివసించేందుకు అంగీకరించరు. దరఖాస్తుదారులకు సైతం బ్రిటన్ వెళ్లే రోజుకు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండకూడదు.

దరఖాస్తు విధానం ఇలా..

1. దరఖాస్తు ఫారమ్‌లను పంపడానికి అధికారిక వెబ్‌సైట్ uk.gov.inని సందర్శించాలి.

2. హోమ్‌పేజీ నుండి ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ 2023 పై క్లిక్ చేయాలి.

3. ఆ తర్వాత ఓపెన్ అయ్యే కొత్త పేజీలో దరఖాస్తు చేయడానికి లింక్‌పై క్లిక్ చేయాలి.

4. అప్లికేషన్‌ను పూర్తి చేసి, అవసరమైన అన్ని ఫైల్‌లను అప్‌లోడ్ చేయాలి.

5. అనంతరం కన్ఫర్మేషన్ పేజీని సేవ్ చేసుకోవాలి.

Exit mobile version