Bride Given Shock Groom Late Minute : భారత వివాహ వ్యవస్థ రాను రాను పతనమవుతంది. ప్రపంచం మొత్తం ఎంతో గొప్పగా, ఆరాధ్యంగా భావించే మన వివాహ వ్యవస్థ పూర్తిగా మసకబారుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో వధూవరులు కనీసం ఒకరిని ఒకరు చూసుకోకుండా వివాహం చేసుకునేవారు. రాను రాను పెళ్లి చూపులు అరెంజ్ చేశారు. తర్వాత లమ్ మ్యారేజెస్. కానీ ఒకరిని ఒకరు చూసుకోకుండా పెళ్లి చేసుకన్న జంటల జీవితం చివరి వరకు కలిసి ఉంటే.. లవ్ మ్యారేజ్, లివ్ ఇన్ పేరుతో కలుస్తున్న జంటలు వేగంగా విడిపోతున్నాయి. కొన్ని నివేధికల ప్రకారం.. ప్రస్తుతం పెళ్లి చేసుకున్న జంటల్లో 70 శాతానికి పైగా విడిపోతున్నారట.
వివాహానికి సంబంధించి వధువులు షాకింగ్ లు ఇవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది. తను ప్రేమించిన వారి గురించి ముందు చెప్తే ఒప్పుకోరని సందేహంతో పెళ్లి పీటల వరకు వచ్చిన తర్వాత తెగించి చెప్తున్నారు. దీంతో ఇటు తల్లిదండ్రులకు, అటు చేసుకోబోయే వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక వేళ పెళ్లి తంతులో తల్లిదండ్రులు బంధువులు నిలదీస్తే ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్నారు.
ఇలా ఒక ఘటన తెలంగాణలో జరిగింది వనపర్తికి చెందిన గీతాంజలితో ప్రవీణ్ కుమార్ వివాహం చేయాలని ఇరు కుటుంబాల సభ్యులు నిర్ణయించారు. పెళ్లికి అన్నీ సమకూర్చుకున్నారు. కానాయపల్లిలోని కోటింగేశ్వర ఆలయంలో మండపం వేశారు. వధువు కళ్యాణ మండపంలోకి వచ్చి పెళ్లి పీటలపై కూడా కూర్చుంది. ఇప్పటి వరకు అన్నీ సజావుగానే జరిగాయి. ఇక తాళి పట్టుకొని వరుడు కడుతున్న సమయంలో ఆయన చేతులను పక్కకు నెట్టి వరుడికి నత్తి ఉందని తాను పెళ్లి చేసుకోనని చెప్పి వెళ్లిపోయింది. షాక్ తిన్న వరుడు తేరుకొని పెళ్లి చేసుకున్నాక నత్తి అంటే బాగా ఇబ్బంది పడేవాడినని అనుకున్నాడట. దీంతో ఇరు కుటుంబాలు వివాహాన్ని రద్దు చేసుకున్నాయి.