Champions Trophy ఛాంపియన్స్ ట్రోఫీ-2025: భారత్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ICC ఈవెంట్లలో కొరకరాని కొయ్యలా మారిన ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. 265 పరుగుల లక్ష్య ఛేదనలో విరాట్ 84 పరుగులతో అదుర్స్ అనిపించారు. శ్రేయస్ అయ్యర్ (45) సైతం రాణించారు. చివర్లో కేఎల్ రాహుల్, పాండ్య టీమ్ ఇండియాను గెలిపించారు. రేపు సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుతో ఆదివారం భారత్ ఫైనల్ ఆడనుంది.