Naa Saami Ranga : 2 రోజుల్లో బ్రేక్ ఈవెన్..నాగార్జున స్టామినా ఏంటో చూపించిన ‘నా సామి రంగ’ చిత్రం వసూళ్లు!
Naa Saami Ranga : చాలా కాలం నుండి అక్కినేని నాగార్జున కి ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు పడుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆఫీసర్, వైల్డ్ డాగ్, ఘోస్ట్ వంటి చిత్రాలు కనీసం 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయాయి. దీంతో నాగార్జున కెరీర్ ఇక క్లోజ్ అని అభిమానులు సైతం అనుకున్నారు. కానీ ఆయన మళ్ళీ ‘నా సామి రంగ’ చిత్రం తో భారీ కం బ్యాక్ ఇచ్చాడు.
ఈ సినిమాకి విడుదలకు ముందు నుండే మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నీ కూడా ఫ్యాన్స్ ని అలరించింది. విడుదల తర్వాత కూడా అంచనాలను మొదటి ఆట నుండే అందుకున్నాయి. ఓపెనింగ్స్ రెండు తెలుగు రాష్ట్రలో దద్దరిల్లిపోయాయి. ఒకపక్క ‘హనుమాన్’ మేనియా లో మిగిలిన రెండు సినిమాలు కొట్టుకుపోతే ‘నా సామి రంగ ‘ చిత్రం మాత్రం ‘హనుమాన్’ కి ధీటుగా హౌస్ ఫుల్స్ ని నమోదు చేస్తూ సంచలనం సృష్టించింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి దాదాపుగా 18 కోట్ల రూపాయలకు జరిగింది. నాగార్జున రేంజ్ కి ఇది చాలా తక్కువే, కానీ గత సినిమాలన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ కావడం, పైగా కాంపిటీషన్ రిలీజ్ కావడం తో అంత తక్కువ రేట్ కి కొనుగోలు చేసారు. అందుకే అనేక ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా చాలా సులువుగా అందుకుంది. ఉదాహరణకి రాయలసీమ ప్రాంతం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ ప్రాంతం లో రెండు కోట్ల 70 లక్షల రూపాయలకు జరిగింది. నిన్నటి వరకు రెండు కోట్ల రూపాయలకు దగ్గరగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా నేటితో బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ ప్రాంతం లో అందుకోనుంది. నేటితో ఈ సినిమా వరల్డ్ వైడ్ వసూళ్లు 13 కోట్ల రూపాయలకు చేరుతుంది.
మరో 5 కోట్ల రూపాయిల షేర్ ఈ వీకెండ్ లో రీచ్ అవుతుందని, ఫుల్ రన్ లో కచ్చితంగా 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. చాలా కాలం తర్వాత నాగార్జున నుండి వచ్చిన సూపర్ హిట్ సినిమా కావడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. థియేటర్స్ కావాల్సినంత దొరికి ఉంటే మాత్రం ఈ సినిమా కచ్చితంగా నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.