Viveka Murder Case : వివేకా కేసులో మళ్లీ బ్రేక్..ఇలా ఇంకెంత కాలమో..

Viveka Murder Case

Viveka Murder Case

Viveka Murder Case : ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. కేసు పురోగతి లేకుండా పోతోంది. ఎంత ముందుకెళ్లాలని చూసినా రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని చాలెంజ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన వివేకా కుమార్తె సునీత, పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవికి షాక్ లు ఎదురయ్యాయి.

కడప కోర్టు ఆదేశాలపై విచారణకు కేటాయించిన హైకోర్టు బెంచ్ తప్పుకోగా ఇప్పుడు తాజాగా మరో బెంచ్ కూడా విచారణకు ససేమిరా అనడంతో కేసు ముందుకు పోయేలా కనిపించడం లేదు. వివేకా హత్యపై సునీత, బీటెక్ రవి, షర్మిల, చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ మాట్లాడొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అధికార పార్టీ కనుసన్నల్లోనే కోర్టు కేసు ఊగిసలాడుతోందని తెలుస్తోంది.

గతంలో జస్టిస్ శేషసాయి, జస్టిస్ విజయ్  ధర్మాసనం కేసు విచారణ నుంచి తప్పుకుంది. కేసును మళ్లీ జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడా బెంచ్ కు విచారణ అప్పగించింది. కానీ వారు కూడా ఈ కేసును విచారణ చేయలేదు. తాము సైతం తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇలా వివేకా కేసు వాదించేందుకు ఏ బెంచ్ కూడా ముందుకు రావడం లేదు.

కడప కోర్టు ఆదేశాలపై రెండు బెంచ్ లు విచారణ నుంచి తప్పుకోవడంతో సంచలనం కలిగిస్తోంది. గతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. కానీ ఇప్పుడు ఇలా బెంచ్ లు విచారణకు రాకుండా తప్పుకోవడం లో ఆంతర్యమేమిటనేది అంతుచిక్కడం లేదు. ప్రస్తుత ఎన్నికల సమయంలో ఇలా కేసు ముందుకు వెళ్లకపోతే పరిణామాలు తీవ్రంగా ఉండే పరిస్థితి ఎదురవుతుంది.

తాజా రాజకీయాల నేపథ్యంలో వివేకా హత్య కేసు ఎందుకు ముందుకు సాగడం లేదో అందరికీ అర్థమైంది. అధికార దాహంతో వైసీపీ చేస్తున్న కుట్రలో భాగమే ఈ పరిణామాలు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల నాటికి ఇంకా ఎన్ని దారుణాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదని పలువురు వ్యాఖ్యానించడం కొసమెరుపు.

TAGS