Brahmos Ex-employee : బ్రహ్మోస్ మాజీ ఉద్యోగికి జీవిత ఖైదు

Brahmos Ex-employee

Brahmos Ex-employee

Brahmos Ex-employee : పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు రహస్యాలు చేరవేసిన కేసులో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్ కు జీవిత ఖైదు పడింది. అధికారిక రహస్యాల చట్టం కింద నాగ్ పూర్ జిల్లా కోర్టు ఈ శిక్ష విధించింది. దీంతో నిశాంత్ 14 ఏళ్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అలాగే, అతనికి రూ.3,000 జరిమానా విధించింది.

నిశాంత్ అగర్వాల్ నాగ్ పూర్ లోని బ్రహ్మోస్ సంస్థకు చెందిన మిస్సైల్ కేంద్రంలోని టెక్నికల్ రీసెర్చ్ సెక్షన్ లో పనిచేసేవాడు. అక్కడ నాలుగేండ్లు విధులు నిర్వర్తించాడు. ఈ సమయంలో బ్రహ్మోస్ కు సంబంధించిన కీలక సాంకేతిక సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐకి లీక్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 2018లో ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన సైనిక నిఘా, ఉగ్రవాద నిరోధక బృందాలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ లో అరెస్టయ్యాడు. తర్వాత పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. విచారణ అనంతరం తాజాగా నాగ్ పూర్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.

TAGS