JAISW News Telugu

Brahmanandam : గురువు జంధ్యాలనే అవమానించిన బ్రహ్మనందం.. బ్రహ్మి క్యారెక్టర్ అలాంటిదా?

Brahmanandam insulted his Guru Jandhyala

Brahmanandam insulted his Guru Jandhyala

Brahmanandam : బ్రహ్మనందం ఈ పేరు విన్నా, చదివినా.. మనకు తెలియకుండానే పెదాలపై చిరునవ్వు వచ్చేస్తుంది. మూడున్నర దశాబ్దాలుగా బ్రహ్మనందం మనల్ని నవ్విస్తూనే ఉన్నారు. ఇంతకాలం హాస్యనటుడిగా ఉన్నది ఒకే ఒక్కడు బ్రహ్మనందం. ఇప్పటికీ బ్రహ్మి అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. తెలుగు హాస్యనటుల్లో అగ్రగణ్యుడు బ్రహ్మనందమే అని చెప్పాలి.

బ్రహ్మనందం సభల్లోనూ, ఇంటర్వ్యూల్లోనే తనకు చాన్స్ లు ఇచ్చి నటుడిగా జీవితాన్ని ప్రసాదించింది జంధ్యాల అని చెబుతారు. ఆయన లేకుంటే తాను హాస్యనటుడిగా ఉండేవాడినే కాను అని కూడా అంటారు. కానీ అలాంటి జంధ్యాలనే బ్రహ్మనందం అవమానించారా? ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  కోట్లు సంపాదించిన బ్రహ్మనందం.. తనకు లైఫ్ ఇచ్చిన జంధ్యాలను విస్మరించడం ఏంటని విస్మయం చెందుతున్నారు.

తెలుగు సీమలో జంధ్యాల ఉల్లాసకర హాస్యచిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన రైటర్ నుంచి డైరెక్టర్ గా మారి ఎన్నో హిట్ చిత్రాలు అందించారు. రాజేంద్రప్రసాద్, నరేశ్, బ్రహ్మనందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు, కోట శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి, దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తదితర వందలాది మందికి అవకాశాలు ఇచ్చి వారిని లబ్ధప్రతిష్ఠులను చేశారు.

అలాంటి జంధ్యాల ఓ సమయంలో ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డారు. ఎన్నో సక్సెస్ లను చూసిన ఆయన.. వరుస ప్లాపులను ఎదుర్కొన్నారు. తీవ్ర నష్టాలు వచ్చాయి. దీంతో డబ్బులు సాయం చేయాలని తన శిష్యుడు బ్రహ్మనందం దగ్గరకు వెళ్లాడు. వాస్తవానికి బ్రహ్మనందంకు అరగుండు పాత్రను పెట్టి ‘అహనా పెళ్లంట’ చిత్రంతో జంధ్యాలే తెరంగ్రేటం చేయించారు. తర్వాత ఎన్నో సినిమాల్లో బ్రహ్మనందానికి మంచి వేషాలు ఇచ్చి ఆయన ఉన్నతికి తోడ్పడ్డారు. అందుకే జంధ్యాల బ్రహ్మనందం దగ్గరకు వెళ్లి డబ్బు సాయం అడిగాడు. అయితే బ్రహ్మనందం దగ్గర డబ్బులు ఉన్నా లేవని చెప్పి పంపించారట.

ఈ సంఘటన అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. ఎంతో మంది నొచ్చుకున్నారట కూడా. పాపం జంధ్యాల చేయిచాచి డబ్బులు అడిగినప్పుడు ఇవ్వకపోవడం ఏంటని బ్రహ్మనందాన్ని అందరూ తిట్టుకున్నారట. జంధ్యాలకు డబ్బు అవసరమైందని తెలుసుకున్నా డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ ఆయనకు సాయం చేయాలని అనుకున్నారు. ఈవీవీ కూడా జంధ్యాల శిష్యుడే. ఆయన దగ్గరే దర్శకత్వ మెళకువలు నేర్చుకున్నారు. జంధ్యాలకు నేరుగా డబ్బులిస్తే తీసుకోడని భావించి.. ఇంటికి సతీసమేతంగా ఆహ్వానించాడు.

ఇంటికొచ్చిన జంధ్యాల దంపతులకు ఈవీవీ మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం దంపతులను సన్మానించి డబ్బును అందజేశారు. వద్దని జంధ్యాల అన్న కూడా గురుదక్షిణగా ఇస్తున్నానని కాదనవద్దని ఈవీవీ బతిమాలాడు. ఇక జంధ్యాలకు తీసుకోక తప్పలేదు. ఈవిషయంలో బ్రహ్మనందాన్ని చాలా మందే తిట్టుకున్నారట.

Exit mobile version