JAISW News Telugu

Boyapati Srinu : విజయ్ దేవరకొండ ని శాశ్వతంగా సినిమాలకు దూరం చెయ్యబోతున్న బోయపాటి శ్రీను?

Boyapati Srinu-Vijay Devarakonda

Boyapati Srinu-Vijay Devarakonda

Boyapati Srinu : బోయపాటి శ్రీను సినిమాలు కేవలం బాలయ్య బాబు కి తప్ప ఎవరికి ఉపయోగపడవు అనేది చాలా మంది అభిప్రాయం. ఆయన తన సినిమాల్లో పెట్టే ఊర మాస్ సన్నివేశాలను కేవలం బాలయ్య బాబు ఒక్కడే హ్యాండిల్ చెయ్యగలడు, కుర్ర హీరోలకు అలాంటి హీరోయిజం పెడితే డిజాస్టర్స్ అవుతాయి అని మొదటి నుండి చెప్తూనే ఉన్నారు. ఒక్క ‘సరైనోడు’ చిత్రం తప్ప, బోయపాటి శ్రీను దర్శకత్వం వచ్చిన లేటెస్ట్ కుర్ర హీరోల సినిమాలన్నీ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి.

‘సరైనోడు’ చిత్రం లో అల్లు అర్జున్ స్క్రిప్ట్ విషయం వేలు పెట్టి, తనకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకున్నాడు కాబట్టి ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది. కానీ మిగిలిన యంగ్ హీరోలు మాత్రం బోయపాటి శ్రీను ని గుడ్డిగా నమ్మారు. ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన యంగ్ హీరో ఎన్టీఆర్ తో చేసిన ‘దమ్ము’ చిత్రం ఎంత ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

అలాగే లెజెండ్ చిత్రం తర్వాత ఆయన బెల్లంకొండ తో చేసిన ‘జయ జానకి నాయక’ చిత్రం, ఆ తర్వాత రాంచరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. ఇప్పుడు రీసెంట్ గా బాలయ్య బాబు తో ‘అఖండ’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తీసిన తర్వాత హీరో రామ్ తో ‘స్కంద’ చిత్రం చేసాడు, ఇది కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్తలు ఏమిటంటే అతి త్వరలోనే బోయపాటి శ్రీను విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయబోతున్నాడట. రీసెంట్ గానే గీత ఆర్ట్స్ సంస్థ అధినేత అల్లు అరవింద్ బోయపాటి శ్రీను తో సినిమా తీస్తున్నట్టుగా అధికారిక ప్రకటన చేసాడు. కానీ హీరో , ఇతర తారాగణం గురించి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు.

అయితే చాలా కాలం క్రితమే విజయ్ దేవరకొండ కి అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాడట. ఆ అడ్వాన్స్ కోసం ఇప్పుడు బోయపాటి శ్రీను తో చెయ్యమని అల్లు అరవింద్ పట్టుబడుతున్నాడట. నాకు ఆయన మాస్ కి అసలు సెట్ అవ్వదు అండీ, వేరే ప్రాజెక్ట్ చేద్దాం ప్లీజ్ అని చెప్పినా కూడా అల్లు అరవింద్ వినట్లేదట. దీంతో చేసేది ఏమి లేక బోయపాటి తో సినిమా చెయ్యడానికి విజయ్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది తెలుసుకున్న నెటిజెన్ల ఈ సినిమా తో నీ కెరీర్ సమాప్తం అంటూ ట్వీట్లు వేస్తున్నారు.

Exit mobile version