T20 World Cup : ఈసారి టీ 20 వరల్డ్ కప్ గెలవాలంటే బౌలింగే కీలకం.. ఆ ముగ్గురే కీలకం

T20 World Cup

T20 World Cup

T20 World Cup : ఈ సారి టీ 20 వరల్డ్ కప్ గెలవాలనే లక్ష్యంతో టీం ఇండియా అమెరికా కు బయల్దేరింది. టీ 20 వరల్డ్ కప్ లో టీం ఇండియా రోహిత్ శర్మ సారథ్యంలో ముందుకు సాగనుంది. గతేడాది టీ 20 సిరీస్ లో బౌలింగ్ లో వీక్ గా ఉన్న ఇండియా ఈసారి బౌలింగ్ విభాగాన్ని పటిష్టంగా చేసుకుంది. 

జస్ ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అమెరికా, వెస్టిండీస్ లలో పిచ్ లు పేస్, స్పిన్ కు రెండింటికి అనుకూలిస్తాయి. కాబట్టి బుమ్రా వైవిధ్యమైన బంతులతో తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే బుమ్రా టీ 20 ల్లో 72 వికెట్లు పడగొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈసారి బౌలింగ్ విభాగానికి నాయకుడిగా ముందుండి నడిపించనున్నాడు. బుమ్రాకు తోడు అర్షదీప్ సింగ్ మరో పేసర్ బౌలింగ్ ఆరంభించనున్నాడు. అర్షదీప్ బౌలింగ్ లో యార్కర్లు, స్లో డెలివరీలు, షార్ట్ పిచ్ బంతులు వేయగల సమర్థుడు. 

స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, చాహల్ ఉన్నప్పటికీ వారికంటే అక్షర్ పటేల్ కే ఎక్కువ చాన్స్ లు ఉన్నాయి. అక్షర్ పటేల్ ఫింగర్స్ స్పిన్ బౌలర్. కుల్దీప్, చాహాల్ రిస్ట్ స్పిన్నర్లు. అక్షర్ పటేల్ వారిద్దరి కంటే మెరుగ్గా బ్యాటింగ్ కూడా చేయగలడు. దీంతో తుది 11  జట్టులో అక్షర్ పటేల్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. 

రవీంద్ర జడేజా, శివమ్ దూబె ఆల్ రౌండర్లుగా జట్టులో కొనసాగనున్నారు. కానీ ఈ పొట్టి ప్రపంచకప్ లో ఏ జట్టు బౌలింగ్ లో బాగా పర్పామెన్స్ చేస్తుందో వారే విజేతగా నిలుస్తున్నారు. సాధారణ టీ 20 లీగ్ ల మాదిరి కాకుండా ఇంటర్నేషనల్ పిచ్ లు బౌలింగ్, బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండేలా తయారు చేస్తారు. టీం ఇండియా మొదటి మ్యాచ్ జూన్ 5 న ఐర్లాండ్ తో మ్యాచ్ ఆడనుంది. పేస్ బౌలర్లు, స్పిన్నర్లపైనే గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

TAGS