YCP : రాజ్యసభ కు ఇద్దరూ అగ్రవర్ణాల నేతలే.. దళిత నేతను పక్కన పెట్టిన వైసీపీ!
YCP Rajya Sabha Candidates : రాజ్యసభ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఆయా పార్టీలు రాజ్యసభకు నాయకులను ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డి పేర్లను పార్టీ ఖరారు చేసింది. ఇందులో ఇద్దరు రెడ్లను, ఒక దళితుడికి అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. గతంలో చిత్తూరు ఎమ్మెల్యే అయిన ఆరణి శ్రీనివాసును రాజ్యసభకు పంపారు. ఆ సమయంలో రాయలసీమ బలిజ వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ నిరాకరించారు. ఆయనకు బదులు చిత్తూరు రెడ్డి వర్గానికి చెందిన విజయానంద రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. దీంతో ఆయనకు రాజ్యసభ ఇస్తారనుకున్నారు.
కానీ, చివరి క్షణంలో కడప జిల్లా రాజంపేటకు చెందిన రఘునాథ రెడ్డికి కేటాయించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇవ్వకుండా ఆయన సోదరుడికి రాజ్యసభ సీటు ఇచ్చారు. అయితే, దళిత నేత అయిన గొల్ల బాబూరావుకు సీటు కేటాయించడం వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టిక్కెట్లు దక్కని పలువురు ఎమ్మెల్యేలు .. టీడీపీ అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. ఎక్కువ మంది రిజర్వుడ్ నియోజకవర్గాల వారికి టిక్కెట్లు మారుస్తున్నారు. ఈ కారణంతో టీడీపీ దళిత అభ్యర్థిని పోటీకి నిలబెడితే దళిత ఎమ్మెల్యేలంతా టీడీపీ అభ్యర్థికి ఓటేస్తారన్న అంచనాలున్నాయి.
అందుకే దళిత నేత గొల్ల బాబూరావుకు టిక్కెట్ ఇచ్చి.. ఓటింగ్ లో దళిత ఎమ్మెల్యేలను ఆయనకు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఒక వేళ ఓడిపోతే దళిత నేత కాబట్టి లైట్ తీసుకుంటారు. చిత్తశుద్ధి ఉంటే.. పార్టీకి విధేయంగా ఉన్న వారి ఓట్లు గొల్ల బాబురావుకు వేసి టిక్కెట్ నిరాకరించిన వారి ఓట్లు రెడ్డి వర్గం వారికి కేటాయించాలన్న డిమాండ్లు ఉన్నాయి.