Rajkot airports : వడోదర, రాజ్ కోట్ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు

Rajkot airports

Rajkot airports

Rajkot airports : గుజరాత్ లోని వడోదర, రాజ్ కోట్ విమానాశ్రయాలకు శనివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా గుజరాత్ లోని వడోదర, రాజ్ కోట్ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో సీఐఎస్ఎఫ్ ఇ-మెయిల్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే పోలీసులు, బాంబుస్క్వాడ్స్, ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువు లభించలేదని అధికారులు వెల్లడించారు. కాగా దేశంలోని ఇతర విమానాశ్రయాలకు సైతం ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు వడోదర పోలీస్ కమిషనర్ నర్సింహా కమోర్ వెల్లడించారు. ఈ బెదిరింపులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

వడోదర విమానాశ్రయానికి జూన్ 18న కూడా బాంబు పేలుడు హెచ్చరికతో కూడిన ఈ-మెయిల్ రావడం.. భద్రతా దళాల తనిఖీల్లో అదంతా వట్టిదేనని తేలిపోవడం విదితమే. ఇటీవల రాజస్థాన్ లోని శ్రీరంగా నగర్, బికనూర్, కోట, బూందీ, ఉదయపూర్, జైపూర్ రైల్వే స్టేషన్లకు కూడా ఒకే రోజు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ తరహా ఘటనలపై భద్రతా వర్గాలు సీరియస్ గా స్పందిస్తూ తక్షణమే తనిఖీలు చేపట్టడంతో పాటు నిందితులను వేగంగా గుర్తిస్తున్నారు.

TAGS