Taj West End Hotel : తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ కు బాంబు బెదిరింపు

Taj West End Hotel
Taj West End Hotel : బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ కు శనివారం ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం, బాంబు స్క్వాడ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. హోట్ మొత్తం సోదాలు జరిపారు.
హోటల్ కు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు బెంగళూరు పోలీస్ డీసీపీ శేఖర్ హెచ్ టీ ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే హోటల్ భద్రతను పెంచి విచారణ చేపట్టినట్లు తెలిపారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సిటీ పోలీస్ టీం హోటల్ కు చేరుకొని తనిఖీలు చెపట్టారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదని సమాచారం.