Praja Bhavan : ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు..

Praja Bhavan

Praja Bhavan

Praja Bhavan : గతంలో ప్రగతి భవన్, ఇప్పడు ప్రజా భవన్ లో బాంబు ఉన్నట్లు మంగళవారం (మే 28) హైదరాబాద్ పోలీసులకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీస్ యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. మధ్యాహ్నం 12.18 గంటలకు కంట్రోల్ రూమ్‌కు కాల్ రాగా.. పంజాగుట్ట పోలీసులతో పాటు నాలుగు బాంబ్ స్క్వాడ్‌ టీములు ఘటనా స్థలికి చేరుకున్నాయని ఘటనా స్థలంలో ఉన్న పంజాగుట్ట ఇన్‌ స్పెక్టర్ బండారి శోభన్ తెలిపారు. పోలీస్ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తుండడంతో ప్రాంగణంలోకి ప్రవేశాన్ని నిషేధించారు.  

2024 లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కానీ ఆయా రాష్ట్రాల, విభాగాల పోలీసులు మాత్రం వీటిని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒక్క ప్రాణం పోయేందుకు వీలు లేదని ఫేక్ కాల్ అయినా సరే.. ప్రాంగణానికి వెళ్లి నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఢిల్లీ విమానాశ్రయానికి కూడా మంగళవారం తెల్లవారు జామున బాంబు బెదిరింపు వచ్చింది, ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లే ఇండిగో ఫ్లైట్ 6E2211లో బాంబు ఉందంటూ కాల్ వచ్చింది. దీంతో ఆ ఫ్లైట్ ను ఐసోలేషన్ బేకు తరలించారు. అక్కడ తనిఖీలు చేయగా అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు.

ఈ విమానంలో ఎగిరే సమయంలోనే బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు పంపించారు. ఐసోలేషన్ బేకు తరలించి చెక్ చేసిన తర్వాత మాత్రమే కన్ఫమ్ చేసుకున్నారు.

మేలో 15కు పైగా బాంబు బెదిరింపులు వచ్చాయి మేలో, పాఠశాలలు, ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కళాశాలలు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కీలకమైన విమానాశ్రయాలు వంటి సున్నితమైన ప్రదేశాలతో సహా దేశానికి 15 కంటే ఎక్కువ బాంబు బెదిరింపులు వచ్చాయి. అనుమానాస్పదంగా ఏమీ లేకపోవడంతో దాదాపు అన్ని బాంబు బెదిరింపులు బూటకమని తేలింది. అయితే ఏజెన్సీలు బెదిరింపుల వెనుక మూలాలను పరిశీలిస్తున్నాయి.

TAGS