IndiGo Flight : ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ప్రయాణికుల దింపివేత

IndiGo Flight
IndiGo Flight : ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఉదయం 5.35కు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లడానికి విమానం టేకాఫ్ కు సిద్ధమవుతున్న సమయంలో బాత్రూంలో ఓ టిష్యూ పేపర్ పై ‘బాంబు’ అని రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా దింపి, ఎయిర్ పోర్టులోకి తరలించారు. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ సిబ్బంది విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. నకిలీ బెదిరింపుగా గుర్తించారు.
కాగా, ఈ నెలలో ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీ విమానాశ్రయంలోనే జరిగింది. ఎయిరిండియా విమానం టాయిలెట్ లో బాంబు బెదిరింపుల రాసి ఉన్న టిష్యూ పేపర్ ను గుర్తించారు. దర్యాప్తు చేపట్టడంతో చివరకు ఆకతాయిల పనిగా తేలింది. మే 15న వడోదరకు వెళ్తోన్న విమానంలో ఈ ఘటన జరిగినట్టు తమకు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు తెలిపారు.