Bollywood Heroine : బాలీవుడ్ లో టాలెంటెడ్ కమ్ గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు విద్యాబాలన్. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా లీడ్ రోల్స్ లోనూ నటించి మెప్పించారు. ఇక సౌత్ ఇండస్ట్రీ ఐటెమ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న సిల్క్ స్మిత బయోపిక్ లో నటించిన డర్టీ పిక్చర్ విద్యా బాలన్ కెరీర్ అమాంతం ఎదిగిపోయింది. ఎలాంటి రోల్ అయినా చేసే సత్తా తనలో ఉందని డర్టీ పిక్చర్ తో నిరూపించుకుంది.
బెంగాలీ సినిమా భోలే దేఖోతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది విద్యాబాలన్. పరిణిత మూవీతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డమ్ సొంత చేసుకుంది. ఇక అక్కడి నుంచి విభిన్న పాత్రలు, విలక్షణ సినిమాలతో బాలీవుడ్ ను కొన్నేళ్ల పాటు ఏలింది. ఆకట్టుకుంటు వస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా దో ఔర్ దో ప్యార్ అనే చిత్రంతో అలరించింది విద్యాబాలన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలన్ తన జీవితంలో జరిగిన సంఘటనపలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బొద్దుగుమ్మ విద్యాబాలన్
బాలీవుడ్ లో హీరోయిన్లు జీరో సైజ్ మెయింటెన్ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ విద్యా బాలన్ కాస్త బొద్దుగా కనిపిస్తుంది. అదే తనకు ఎస్సెట్ అని పలు మార్లు చెప్పింది. అయితే తన దగ్గరకు వచ్చే దర్శక నిర్మాతలు కాస్త బరువు తగ్గమని కోరుతుంటారని చెప్పింది. అయితే బరువు తగ్గడానికి తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, పైగా అనారోగ్యానికి గురైనట్లు కూడా చెప్పింది. తన ఆరోగ్యంపై ప్రభావం పడుతున్నందున బరువు తగ్గే ఆలోచనను విరమించుకున్నట్లు చెప్పింది. అయితే ఇతర హీరోయిన్ల లాగా తాను ఉండాలనుకోవడం మూర్ఖత్వమని పేర్కొంది. బాడీ షేమింగ్ కు గురైనట్లు కూడా వెల్లడించింది.
ఆ సినిమాతో చైన్ స్మోకర్ గా..
విద్యాబాలన్ కొన్ని రోజులుగా ‘దో ఔర్ దో ప్యార్’ సినిమా ప్రమోషన్లకు అటెండ్ అవుతున్నది. ఈ సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని విద్య బయటపెట్టింది. తన కెరీర్ లో ఓ సినిమాలో సిగరెట్ తాగాల్సి వచ్చిందని, అది అలవాటుగా మారిందని చెప్పింది. ఆ వ్యసనాన్ని చాలాకాలం పాటు విడిచిపెట్టలేకపోయానని తెలిపింది. సిల్క్ స్మిత బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’ సినిమాలో విద్యాబాలన్ సిల్క్ స్మిత పాత్రను పోషించింది. ఆ పాత్రలో ఓ సీన్ లో విద్య సిగరెట్ తాగాల్సి వచ్చింది. కానీ ఆ సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత కూడా సిగరెట్ మానలేకపోయింది. ఓ దశలో చైన్ స్మోకర్ గా మారినట్లు తెలిపింది. ఆ సినిమాకు ముందుక తానెప్పుడూ సిగరెట్ తాగలేదని చెప్పింది.
కొన్ని సందర్భాల్లో పాత్రలు, సినిమా సహజంగా రావాలంటే కొన్ని త్యాగాలు తప్పవని, అలాగే కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పింది. అయితే విద్యాబాలన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికీ ఇంకా సిగరెట్ తాగుతున్నారా? అన్న ప్రశ్నకు విద్యాబాలన్ చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేసింది. ‘కెమెరా ముందు ఈ విషయం గురించి మాట్లాడాలని తాను అనుకోవడం లేదన్నారు. కానీ సిగరెట్ వాసన అంటే తనకు చాలా ఇష్టమన్నారు. కాలేజీలో, బస్టాప్‌లో పొగతాగే వ్యక్తి పక్కనే నిల్చొని ఆ వాసనను ఆస్వాదించినట్లు తెలిపారు విద్యా బాలన్.