Anant Ambani : అనంత్ అంబానీ పెళ్లిలో నాగిని డ్యాన్స్ వేసిన బాలీవుడ్ స్టార్ హిరో
Anant Ambani : ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. తారలు దిగివచ్చిన వేళ తళుకు బెళుకులతో మిరుమిట్లు గొలిపే కాంతులతో అతిరథ మహారథుల మధ్య పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు ప్రముఖులు తరలివచ్చారు. ఈ పెళ్లి వేడుక బరాత్ లో బాలీవుడ్ స్టార్ హిరో దీపికా పదుకొణే భర్త రణ్ వర్ సింగ్ స్పెషల్ అట్రాక్షన్.
అనంత్ అంబానీ పెళ్లిలో నాగిని ఢ్యాన్స్ చేసి అతిథులను అలరించాడు. అర్జున్ కపూర్, వీర్ పహారియా కూడా తోడై డ్యాన్స్ చేశారు. దీంతో అందరూ హుషారుగా వీరిని ఎంకరేజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. కానీ నెటిజన్లు దీనిపై కొంతమంది పాజిటివ్ గా కామెంట్స్ చేస్తుంటే మరికొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకకు భార్య దీపికా పదుకొణేతో రణీవర్ సింగ్ హాజరయ్యారు. ఈ వేడుకలో మాజీ క్రికెటర్ దోని దంపతులు, తెలుగు హిరో రామ్ చరణ్ దంపతులు, మహేశ్ బాబు దంపతులు కూడా హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, పవన్ కల్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, సారా అలీ ఖాన్, రజినీ కాంత్, సూర్య, జ్యోతిక, హర్దిక్ పాండ్యా, ఉపాసన కొణిదెల, షారూక్ ఖాన్, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ హాజరయ్యారు.
అనేక మంది పారిశ్రామిక వేత్తలు, డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ రెజ్లర్ జాన్ సీనా.. హాలీవుడ్ సింగర్ లు ఇలా అన్ని రంగాల కళాకారులు, నటులు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు, హిరోలు, హిరోయిన్లతో మొత్తం జియో కన్వెన్షన్ సెంటర్ నిండిపోయింది. తారలందరూ ఒక్క చోట చేరగా.. బరాత్, స్పెషల్ ప్రోగ్రాం అన్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన ఒక్కో వీడియో బయటకు వస్తోంది. అయితే ఈ పెళ్లి కోసం దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.