Hyderabad : హైదరాబాద్‌లో బాలీవుడ్ నటిపై దాడి

Hyderabad : ఈ నెల 21న రాత్రి 9 గంటల సమయంలో హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న బాలీవుడ్ నటి వద్దకు ఇద్దరు మహిళలు వెళ్లి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు. అదే రోజు రాత్రి 11 గంటలకు ముగ్గురు పురుషులు ఆమె గదిలోకి ప్రవేశించి వారితో గడపాలని బలవంతం చేశారు. ఆమె ప్రతిఘటించడంతో వారు ఆమెపై దాడి చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ఒక వృద్ధురాలు, మరో ఇద్దరు మహిళలు కలిసి నటిని గదిలో బంధించి రూ.50 వేలు నగదు దోచుకెళ్లారు. బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు మాసబ్‌ట్యాంక్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.

TAGS