Bollywood actor Govinda : బాలీవుడ్ నటుడు గోవిందా కు బుల్లెట్ గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్

Bollywood actor Govinda
Bollywood actor Govinda : బాలీవుడ్ నటుడు గోవిందా సూపర్ స్టార్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే గోవిందా 1990 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా రాణించాడు. ప్రస్తుతం గోవిందా ఎలాంటి సినిమాలు చేయడం లేదు. ముఖ్యంగా ఆయనకు ఆఫర్లు కూడా రావడం లేదని తెలుస్తోంది.
అయితే గోవిందా తన ఇంటి నుంచి కోల్కతాకు వెళ్లే సమయంలో బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే గోవిందకు అయిన బుల్లెట్ గాయాలు ఎవరో చేసినవి కావని ఆయన లైసెన్స్ రివాల్వర్ తీసుకునే సమయంలో కింద పడడంతో అది లోడ్ చేసి ఉందని దీంతో అది వెంటనే పేలింది. బుల్లెట్లు కాస్త గోవిందా కాలులోకి దూసుకెళ్లాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా బుల్లెట్ ని తీసేసిన వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని చెప్పారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
గోవిందా ఇంట్లో ఉండగా ఈ ఘటన జరిగిందని ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటన పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గోవిందా కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే గోవిందా కు అప్పట్లో దావూద్ ఇబ్రహీం లాంటి వారితో సంబంధాలు ఉన్నాయని పుకార్లు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాదని గోవిందా బయటకు వచ్చి చెప్పాడు. గోవిందా రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాల్లో చేయడం మానేశాడు. కానీ రాజకీయాల్లో కూడా ఆయన రాణించలేకపోయాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున గోవిందా రాజకీయాలు అడుగుపెట్టిన అక్కడ కూడా రాణించలేక వెనుదిరిగారు.
గోవిందా ప్రస్తుతం బిజినెస్ లు చూసుకుంటున్నారు. కాగా 1991లో వచ్చిన హం సినిమా గోవింద కెరీర్ ని టాప్ లెవెల్ లోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత కుష్బూతో ఓ సినిమాలో నటించగా ఆ సినిమా కూడా హిట్ అయింది. గోవిందా తెలుగులో 2010 సంవత్సరంలో రామన్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇలా బాలీవుడ్ తో కాకుండా టాలీవుడ్ తో పాటు మరికొన్ని చిత్రాల్లో కూడా ఆయన నటించి మెప్పించాడు. కాగా బుల్లెట్ గాయాలైన అని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.