Boiled Egg and Omelette : రోజుకో గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అని వైద్యులు చెబుతున్నారు. గుడ్డులో 6 గ్రాముల ప్రొటీన్లు, 5 గ్రాముల కొవ్వు, ఒమేగా 3 కొవ్వు ఉంటుంది. దీంతో చాలా మంది గుడ్డు తినడానికి ఇష్టపడుతుంటారు. ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్ముతుంటారు. ఒక గుడ్డులో 72 కేలరీల శక్తి ఉంటుంది. గుడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీని వల్ల గుడ్డు తినడం మంచి అలవాటుగానే చెబుతారు.
గుడ్డులో బి12, డి విటమిన్లతో పాటు రిబోప్లావిస్ లు, అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లు దాగి ఉన్నాయి. గుడ్డును ఆమ్లెట్ గా వేసుకుంటే మంచిదా ఉడకబెట్టుకుంటే మంచిదా అనే అనుమానాలు చాలా మందిలో వస్తుంటాయి. ఉడికించిన గుడ్డులో కోలిన్ అనే పోషకం మెదడు ఆరోగ్యానికి మంచిది. ఉడకపబెట్టిన గుడ్డు తినడం వల్ల పోషకాహారం లభించినట్లే.
గుడ్డును పగలగొట్టి ఆమ్లెట్ గా వేయడం వల్ల పోషక విలువలు కొంత వరకు దెబ్బతింటాయి. అందులో నూనె కలవడం వల్ల నష్టమే. అందుకే ఉడకబెట్టి తినడం వల్ల అందులోని ప్రొటీన్లు పాడవకుండా ఉంటాయి. ఆమ్లెట్ వేసుకునేటప్పుడు కూరగాయలు కూడా కలుపుకున్నా ఉడకబెడితేనే మంచి లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుడ్డును ఉడకబెట్టుకుని తినడం వల్ల పోషకాలు మెండుగా అందుతాయి. రోజుకో గుడ్డు తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు. గుడ్డు శాఖాహారం అని కొందరు కాదు మాంసాహారం మరికొందరు వాదిస్తుంటారు. ఏది ఏమైనా గుడ్డు మనకు మంచి బలమైన ఆహారం కావడంతో రోజు దీన్ని తీసుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని సూచిస్తున్నారు.