Boeing Center : బెంగుళూరులో రూ.1600 కోట్లతో బోయింగ్ కేంద్రం ప్రారంభం

Boeing Center

Boeing Center in Bangalore

Boeing Center : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం బెంగుళూరులో బోయింగ్ సెంటర్ ను ప్రారంభించారు. అమెరికా వెలుపల అతిపెద్ద సంస్థ అయిన బోయింగ్ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే విమాన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభించింది. పరిశోధన డెవలప్ మెంట్ చేయడంపై ఫోకస్ పెట్టారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ వ్యూహంలో ఇది ఒక భాగమని తెలుస్తోంది.

దేశంలో విమానాలు నడిపే వారిలో మహిళలే ఎక్కువ. ఇది ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు. మహిళలు పైలెట్లుగా మారే కలలను సాకారం చేసుకునేందుకు బోయింగ్ సుకన్య ఉపయోగపడుతుంది. బోయింగ్ కు చెందిన ఈ క్యాంపస్ లో భారత్ లో తయారైన ఆధునిక విమానాలను ప్రపంచానికి అందించనుంది. కొత్త ప్రయోగాలు చేపట్టనుంది. ప్రపంచంలోనే సాంకేతిక డిమాండ్ ఆధారంగా తన సేవలు కొనసాగించనుంది.

సుమారు 43 ఎకరాల విస్తీర్ణంలో బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఇందుకు రూ.16 కోట్లు ఖర్చు చేసింది. ప్రపంచ ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమ కోసం ఉత్పత్తులు, బోయింగ్ క్యాంపస్ లో 3000 మందికి పైగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. బోయింగ్ భారత సై్యంతో కలిసి పని చేస్తుంది. రక్షణ రంగంలో స్వావలంబన భారత్ పథకం కింద ఇది ఒక ముఖ్యమైన మైలురాయి.

బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. దేశంలోని మహిళలకు విమానరంగంలో మరిన్ని మంచి ఫలితాలు రానున్నాయి. సెన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ వంటి రంగాల్లో యువత నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. విమానయాన రంగంలో ఉద్యోగాల కోసం శిక్షణ ఇస్తారు. రాబోయే రోజుల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు రానున్నాయని తెలుస్తోంది.

TAGS