Delhi-Lucknow : ఢిల్లీ-లక్నో హైవేపై సూట్ కేసులో మహిళ మృతదేహం

Delhi-Lucknow : ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు సూట్ కేసులో కుక్కి రోడ్డుపై పడేశారు. ఈ ఘటన హాపూర్ జిల్లాలోని కొత్వాలి నిజాంపూర్ ప్రాంతానికి సమీపంలో వెలుగు చూసింది. నిజాంపూర్ ఏరియాలోని ఢిల్లీ-లక్నో హైవే సర్వీస్ రోడ్ పై శనివారం అనుమానాస్పదంగా ఓ సూట్ కేసు కనపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సూట్ కేసును పరిశీలించగా.. అందులో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనను హాపూర్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వినీత్ భట్నాగర్ ధ్రువీకరించారు.

మహిళ ఒకరోజు ముందే చనిపోయి ఉండవచ్చని, మృతురాలి ఒంటిపై ఉన్న గాయాలు చూస్తే అర్థమవుతోందన్నారు. సూట్ కేసులో మహిళా డెడ్ బాడీతో పాటు కొన్ని దుస్తులు కూడా గుర్తించామని తెలిపారు. హత్యకు గురైన మహిళ ఎవరనేది తెలియరాలేదని.. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

TAGS