Bobby deol:రణ్‌బీర్ కపూర్ యానిమల్ థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించింది. దాదాపు 800కోట్ల వసూళ్లను ఇప్పటికే సాధించి థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన నటీనటులకు మంచి పేరొచ్చింది. రణబీర్- రష్మిక మందన, బాబిడియోల్ నటనకు ప్రత్యేకించి గుర్తింపు దక్కింది.
యానిమల్ లో ఆఫర్ నటుడు బాబి డియోల్ కి పునరుజ్జీవనం లాంటిది. ఆల్మోస్ట్ అతడు పరిశ్రమ నుంచి ఎగ్జిట్ అయ్యాడు అనుకుంటున్న తరుణంలో ఇలాంటి గొప్ప అవకాశం అతడిని వరించింది. యానిమల్ థియేటర్‌లలో విడుదలైనప్పటి నుండి బాబీ డియోల్ మబ్బుల్లో తేలి సెలబ్రేట్ చేసుకునేంతగా అతడి గురించి చర్చ సాగుతోంది. ఈ సినిమాలో అత్యుంత క్రూరుడైన అబ్రార్ పాత్రలో అతడు నటించిన విధానాన్ని ప్రేక్షకులు ప్రశంసించారు. హత్యలు, అత్యాచారం చేసే అత్యంత కర్కశుడు, పాశవికుడు అయిన ప్రతినాయకుడి పాత్రలో అతడు నటించాడు.
అయితే ఈ పాత్రను మొదట్లో అసహ్యపడ్డానని తాజాగా బాబిడియోల్ వెల్లడించాడు. ఫిల్మ్ కంపానియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబీ మాట్లాడుతూ `షూటింగ్ ప్రారంభించినప్పుడు నాపై నాకు అసహ్యం అనిపించింది. కానీ నేను కేవలం ఒక పాత్రలో నటిస్తున్నానని అప్పుడు గ్రహించాను. నేను ఎందుకు చాలా అసహ్యంగా ఉన్నాను? అని ప్రశ్నించుకుంటే… ఫిర్ మైనే ఉన్హీ లోగోన్ కే సాథ్ జింకే సాథ్ సీన్ మేం జో భీ కియా హై, ఫిర్ ఉంకే సాథ్ హమ్ షామ్ కో సాథ్ మే బైత్ కే ఖానా ఖా రహే హైం`అని అన్నాడు.
ముఖ్యంగా యానిమల్ లో సహచరుడిని చంపి, భార్యలపై లైంగిక వేధింపులకు పాల్పడే హింసాత్మక పాత్రలో బాబీడియోల్ నటించాడు. ఈ సినిమాలో అతని ఎంట్రీ సీన్ కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. జమాల్ కుడు.. పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అబ్రార్ పాత్రకు చాలా అంశాలు ప్లస్ అయ్యాయి. సందీప్ వంగా ఆ పాత్రను మలిచిన తీరు ఆకట్టుకుంది.
యానిమల్ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.518 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 17 రోజుల్లో 835 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. రణబీర్ కపూర్ – బాబీ డియోల్ కాకుండా, యానిమల్`లో అనిల్ కపూర్, రష్మిక మందన్న, ట్రిప్తి డిమ్రీ కూడా కీలక పాత్రల్లో నటించారు. `కబీర్ సింగ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దీనికి దర్శకత్వం వహించారు.