Naren Kodali : ‘తానా (TANA)’ అధ్యక్షుడిగా నరేన్ కొడాలి ఎన్నికకు బోర్డ్ ఆమోదం..

Naren Kodali

Dr. Naren Kodali

Naren Kodali : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఎన్నికలు సాధారణ ఎన్నికల తలపించేలా ఉత్కంఠతగా జరిగాయి. 2 నెలల ఎలక్షన్ క్యాంపైన్ ముగిసిన తర్వాత ఆన్ లైన్ వేదికగా ఓట్లను అభ్యర్థించారు. ఈ పోటీల్లో నరేన్ కొడాలి ప్యానెల్ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ ప్యానెల్ 2023-2025 వరకు కొనసాగుతుంది.

పాత ప్యానెల్ రద్దయి కొత్త ప్యానెల్ ఎన్నుకునే వరకు మధ్యలో సంవత్సర కాలం గడిచిపోయింది. కోర్టు కేసులు, తదితరాల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ సారి ఆన్ లైన్ లోనే ఎక్కువగా క్యాంపెయిన్ చేశారు. దీనికి తోడు టైం కూడా తక్కువగా ఉండడంతో ఆ గోల తప్పిందంటూ సభ్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తానా హిస్టరీలోనే ఈ సారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో ఎలక్షన్స్ నిర్వహించడంతో ఫలితాలపై సర్వత్రా కుతూహలం నెలకొంది.

నరేన్ కొడాలి సారథ్యంలోని టీం కొడాలి ప్యానెల్ క్లీన్ స్వీప్ చేసి పైచేయి సాధించింది. దీనికి విరుద్ధంగా సతీశ్ వేమూరి సారథ్యంలోని టీం వేమూరి ప్యానెల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా సైలెంట్ ఓటింగ్‌తో అద్భుతాలు జరుగుతాయని ఆశించి భంగపడింది.

అయితే, 2024 అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ జనవరి, 19వ తేదీతో పూర్తయ్యింది. పోటీలో అభ్యర్థుల ఎన్నికల సరళి, ఓటింగ్ ప్రక్రియపై ఓటమి పాలైన సభ్యులు అనుమానాలు రేకెత్తించారు. వీటిని పరిగణలోకి తీసుకున్న తానా బోర్డ్ ఎన్నికల కమిటీ నుంచి వివరణ కోరింది. దీన్ని సమీక్షించిన బోర్డ్ అనుమానాలను తోసిపుచ్చుతూ నరేన్ కొడాలితో పాటు ఇతర కార్యవర్గ సభ్యుల ఎన్నిక చెల్లుతుందని, మార్చి 1 (శుక్రవారం)న ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొడాలి టీం బాధ్యతలు స్వీకరించవచ్చని చెప్పింది.

TAGS