JAISW News Telugu

MLC Kavitha : దెబ్బ మీద దెబ్బ.. కవితను వెంటాడుతున్న కష్టాలు..!

MLC Kavitha

MLC Kavitha

MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీని ఢిల్లీ కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. అదే సమయంలో లిక్కర్ స్కాంలో కవిత సన్నిహితుల ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. మాదాపూర్ లోని డీఎస్ఆర్ హోమ్స్ లోని కవిత మరదలు అఖిల నివాసానికి మార్చి 23 ఉదయం 6.45 గంటలకు ఈడీ అధికారుల బృందం వచ్చి సోదాలు నిర్వహించింది.

కవిత భర్త డీఆర్ అనిల్ కుమార్ సోదరి అఖిల. ఈ నెల 15వ తేదీ కవితను అరెస్టు చేసిన రోజు ఈడీ అధికారులు అనిల్ కుమార్ నివాసంలో సోదాలు చేసినప్పుడు ఆయన బ్యాంకు లావాదేవీల్లో ఆమె పేరు ఉన్నట్లు గుర్తించారు. సాయంత్రం వరకు కొనసాగిన ఈడీ సోదాల్లో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలో కూడా ఈడీ ప్రత్యేక బృందం సోదాలు నిర్వహించింది.

అంతకు ముందు ఈడీ అధికారులు బీఆర్ఎస్ నేతకు చెందిన ఇద్దరు వ్యక్తి గత సహాయకులను విచారించి వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ల నుంచి డేటాను డిలీట్ చేయడంలో వారి పాత్రపై దర్యాప్తు చేస్తోంది.

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కవితను మార్చి 15వ తేదీ (శుక్రవారం) హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదే రోజు ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లి ఈడీ కస్టడీకి అప్పగించారు.

శనివారంతో కస్టడీ ముగియడంతో మరో ఐదు రోజులు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరగా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మార్చి 26వ తేదీ వరకు కేవలం మూడు రోజులు మాత్రమే కస్టడీకి అనుమతించారు.

Exit mobile version