Blockbuster hit : థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కు.. ఓటీటీలో మిశ్రమ స్పందన.. కారణం ఇదేనా?

Blockbuster hit

Blockbuster hit Munjya Movie

Blockbuster hit : ఈ ఏడాది స్లీపర్ బ్లాక్ బస్టర్ ‘ముంజ్యా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఈ చిత్రం ఒక యువకుడు తన స్వగ్రామానికి రావడం, అక్కడ అతను తన కుటుంబ రహస్యాన్ని కనుగొనడం, వివాహం చేసుకోవడానికి ఆత్రుతగా ఉన్న ‘ముంజ్యా’ అనే రాక్షసుడిని ఎదుర్కోవడం యువకుడి ప్రేయసితో తనకు వివాహం చేయమని అడగడం కథ. ఇక ఆ యువకుడు ముంజ్వా నుంచి తనను, తన ప్రేమను ఎలా రక్షించుకుంటాడు అనేదే సినిమా. కేవలం 30 కోట్లతో తీసిన ఈ మూవీ 140 కోట్లకు పైగా రాబట్టింది. థియేటర్లలో ఫుల్ రన్ పూర్తి చేసుకున్న మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.

డిస్నీ + హాట్ స్టార్ లో ‘ముంజ్వా’ అందుబాటులో ఉంది. అయితే థియేటర్లలో ఇంట్రస్ట్ చూపిన ప్రేక్షకులు ఓటీటీలో మాత్రం ఇంట్రస్ట్ చూపడం లేదు. ఇది హారర్ కామెడీ సినిమా. ఓటీటీలో మాత్రం వ్యూవ్స్ సంపాదించలేకపోతోంది. ఈ సినిమా రూ. 140 కోట్లు రాబట్టడంపై వ్యూవర్స్ సందేహలు వ్యక్తం చేస్తున్నారు.
సినిమా కాన్సెప్ట్ బాగానే ఉన్నా ముగింపు సాధారణంగా తీసుకున్నారని పెదవి విరుస్తున్నారు. లాస్ట్ సీన్స్ ఆకట్టుకోలేదని ఓటీటీ వ్యూవర్స్ చెప్తున్నారు.

ఈ విధానాన్ని పరిశీలిస్తే.. థియేటర్లలో విజయం సాధించిన సినిమా ఓటీటీలో ఫ్లాప్స్ కావడం ప్రస్తుతం ట్రెండ్ గా నడుస్తుందని అర్థం అవుతుంది. థియేట్రికల్ అనుభవం సౌండ్, పిక్చర్ ఓటీటీలో ప్రభావితం చూపవు. అందుకే ఈ మూవీ అంతగా విజయం సాధించలేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మిక్స్ డ్ ఓటీటీ ఆదరణ ఉన్నప్పటికీ, ముంజ్యా థియేటర్లలో ఉన్నంత భారీ విజేతగా ఓటీటీలో మాత్రం కనిపించలేదు. ఈ సినిమా పరిమితంగా ఉన్న వనరులతో చిత్రాలను ఎలా తీయాలో కొత్త జనరేషన్ కు చూపిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

TAGS