Osmania Medicos: కళ్లకు గంతలతో ఉస్మానియా మెడికోల నిరసన

Osmania Medicos : పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు దీపాంకర్ మాట్లాడుతూ ప్రతి నెల నిర్దిష్టమైన తేదీకి స్టైఫండ్ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నామని, అధికారుల చుట్టూ ప్రతి నెల తిరగవలసి వస్తోందని అన్నారు. మెడికోల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఉస్మానియా ఆసుపత్రి భవనం మూసివేసి నాలుగేళ్లయిందని, పక్కనే ఉన్న మరో భవనంలోకి ఆసుపత్రిని మార్చారని తెలిపారు. విపరీతమైన రోగుల రద్దీ కారణంగా ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని దీపాంకర్ కోరారు.

TAGS