Edison : ప్రజలరా జాగ్రత్త.. న్యూజెర్సీ ఎడిసన్ లో నల్ల ఎలుగుబంటి సంచారం

Black bear roaming in Edison, New Jersey

Black bear roaming in Edison : అడవులు అంతరిస్తున్నాయి. మనిషి ఆక్రమణకు ఉన్న చెట్లు చేమలు కూడా కనుమరుగవుతున్నాయి. ఇండియాలోనే కాదు.. అమెరికాలోనూ ఈ ఒరవడి కొనసాగుతోంది. అందుకే అడవిలో ఉండే జంతువులు ఇప్పుడు జనవాసాల్లోకి వచ్చిపడుతున్నాయి.

అగ్రరాజ్యం అమెరికాలోనూ ఇప్పుడు జంతువులు జనారణ్యంలోకి వస్తూ మనుషులను భయపెడుతున్నాయి. తాజాగా న్యూజెర్సీలో ఓ ఎగులుబంటి కలకలం రేపింది. ఏకంగా జనావాసాల్లోకి వచ్చేసి భయపెట్టింది.

ఎడిసన్ లో శుక్రవారం ఉదయం హార్డింగ్ అవెన్యూ నుండి డోరిస్ కోర్ట్ , జీన్ ప్లేస్ ప్రాంతంలో ఓ నల్లటి ఎలుగుబంటి కలకలం రేపింది. రోడ్లు దాటుకుంటూ ఇల్ల మధ్య నుంచి చెట్టు దాటుకుంటూ వెళ్లింది. ఇదంతా పగలే జరిగింది. అక్కడ ఎవరైనా స్థానికులు ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది.. ఒక నల్ల ఎలుగుబంటి ఇప్పుడు ఎడిసన్ లో తిరుగుతోంది. స్థానికులంతా దయచేసి జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.

చూడడానికి ఎలుగుబంటి బలంగా.. దట్టంగా ఉంది. ఎవరైనా కంటపడితే పెద్ద ప్రమాదమే వాటిల్లేలా ఉంది. సో అక్కడి స్థానికులంతా జాగ్రత్తగా ఉండాలని యూబ్లడ్ ఫౌండర్ డా.జై , జగదీష్ బాబు యలమంచిలి గారు ప్రజలకు పిలుపునిచ్చారు.

TAGS