BJP Journey With Chandrababu : ఏపీలో చంద్రబాబుతోనే బీజేపీ ప్రయాణం.. ఆ తీర్మానంతో చెప్పేశారుగా..
BJP Journey With Chandrababu : ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార వైసీపీ ని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే టీడీపీ, జనసేన సమన్వయంతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇక బీజేపీని కూడా తమతో కలిసిరావాలని కోరుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే తాజాగా బీజేపీ రాష్ర్ట కమిటీ సమావేశం ఒంగోలులో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ర్ట ఇన్ చార్జి బీఎల్ సంతోష్ హాజరయ్యారు. పార్టీ రాష్ర్ట అధ్యక్షురాలు పురందేశ్వరి సారథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. అయితే పార్టీ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని తీర్మానం ఒకటి చేశారు.
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును తప్పుబడుతూ బీజేపీ రాష్ర్ట కమిటీ తీర్మానం చేసింది. అయితే రాష్ర్ట కార్యవర్గ సమావేశంలో ఏకంగా తీర్మానం ఎందుకు చేశారనేది అంతు పట్టడం లేదు. అయితే ఇప్పటికే టీడీపీ, జనసే పొత్తు ఖరారు కావడం.. ఇక బీజేపీ కూడా వారితో కలిసి వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల అరెస్టులను ఖండిస్తూ తీర్మాణం చేసినట్లు గా చెబుతున్నారు. అయితే టీడీపీ నేతలు ఈ విషయమై ఇప్పటివరకు స్పందించలేదు.
టీడీపీతో వెళ్లడం ఇష్టం లేని వారు ఏపీ బీజేపీలో చాలా మంది ఉన్నారు. వారు వైసీపీతో దోస్తీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల విజయసాయి పురందేశ్వరిపై ఎన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినా, వారు స్పందించలేదు. తమ పార్టీ అధ్యక్షురాలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా ఏ ఒక్కరూ ఖండించలేదు. అయితే ఇప్పుడు తాజా భేటీలో మాత్రం అందరూ కలిసి టీడీపీ అనుకూలంగా తీర్మానం చేశారు. అంటే ఇక తమ పొత్తు ఇక టీడీపీతోనేని తేల్చి చెప్పినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అధికార వైసీపీకి ఇది గడ్డు పరిస్థితే. ఈ మూడు పార్టీల కలయికే కాకుండా రాష్ర్టంలో చంద్రబాబుపై సానుభూతి పెరగడానికి ఒకే ఒక్క కారణం జగన్. ఎన్నికల సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేయించి, వరుస కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం ఇప్పుడు టీడీపీకి కలిసి వస్తున్నది. రానున్న రోజుల్లో దీనికి తగిన మూల్యం వైసీపీ చెల్లించుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.