JAISW News Telugu

BJP VS Congress : చచ్చిన పామునే మళ్లీ మళ్లీ చంపుతూ.. బీజేపీలో ఇంకా అభద్రతా భావమే..

BJP VS Congress

BJP VS Congress

BJP VS Congress : బీజేపీ మూడో సారి అధికారంలోకి కచ్చితంగా వస్తామన్న భరోసాతో ఉంది. ఈసారి 400లకు పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే మళ్లీ చంద్రబాబు నాయుడు(టీడీపీ), నితీశ్ కుమార్ (జేడీయూ) వంటి పాత మిత్రులను కూడా ఎన్డీఏలోకి చేర్చుకుంది. కనుక ఇంకా బీజేపీ బలపడింది. మరో పక్క ఇండియా కూటమిలో భాగస్వామి పార్టీల నేతలపైకి ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలను ఉసిగొల్పుతూ కేసులు నమోదు చేయిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు.

అర్వింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, కవిత వంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించి దేశంలో ఏ పార్టీ కూడా బీజేపీని ఎదిరించే ఆలోచన చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కనుక దేశంలో బీజేపీకి ఎదురేలేదని చెప్పవచ్చు. అయినప్పటికీ బీజేపీ ఇంకా చచ్చిన పామును చంపినట్లుగా ఎంతో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇంకా చావుదెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీని చూస్తే బీజేపీ ఇంకా అభద్రతా భావం కలుగుతోందన్న మాట.

కాంగ్రెస్ అంటే భయమో లేదా ముందు జాగ్రత్తగా ఆదాయ పన్ను శాఖ చేత కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలన్నీ ఫ్రీజ్ చేయించింది. రూ.200కోట్ల జరిమానా చెల్లించాలని ఆదాయపన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. అయినా బీజేపీ పెద్దలకు ఇంకా ఎక్కడో ఓ మూల కాంగ్రెస్ అంటే భయం, అభద్రతా భావం ఉండి ఉండవచ్చు. అందుకే 2017 నుంచి 2021 వరకు ఆదాయపన్ను బకాయిలు, వడ్డీ, జరిమానా కలిపి మొత్తం రూ.1,700 కోట్లు కట్టాలని ఆదాయపన్ను శాఖ నోటీస్ పంపించింది.

దీనిపై అభ్యంతరం చెపుతూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది కానీ హైకోర్టు కాంగ్రెస్ పిటిషన్ తిరస్కరించింది. దీంతో కాంగ్రెస్ ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టబోతోంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ ‘‘లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని పోటీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నంగా మేము దీన్ని చూస్తున్నాం. ఇది టాక్స్ టెర్రరిజమే. బీజేపీ తక్షణం మాపై ఈ టాక్స్ ఉగ్రవాదాన్ని మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు.

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేశానని భావించి పట్టించుకోవడం మానేసినందుకు అదే కాంగ్రెస్ చేతిలో ఓడిపోయి తన రాజకీయ పతనాన్ని కొనితెచ్చుకున్నారు. కనుక కాంగ్రెస్ చేతిలో ఓడిపోయి తన రాజకీయ పతనాన్ని కొనితెచ్చుకున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీ చర్చిన పాము వంటిదే అయినా ఇంకా ఇంకా చంపుతూనే ఉండాలని బీజేపీ పెద్దలు గట్టిగా నమ్ముతున్నట్లున్నారు. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వ్యవహరించినందుకే దేశ ప్రజలు గద్దె దించారని బీజేపీ పెద్దలకు గుర్తులేనట్టు వ్యవహరిస్తున్నారు.

Exit mobile version