BJP view : తాము ఓడినా పర్వాలేదు కానీ.. కాంగ్రెస్ మాత్రం గెలవద్దని బీజేపీ రాజకీయం చేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక వేళ కాంగ్రెస్ గెలిస్తే ఢిల్లీలోని తమ పీఠం కిందకు నీళ్లు తెస్తుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బీఆర్ఎస్ కు వెనుక నుంచి సహకరిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.
ఐదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆర్థికంగా బాగానే ఉన్నారు. ములుగు లాంటి కొన్ని నియోజకవర్గాల్లో దొరికిన నోట్ల కట్టలను చూస్తే వారి ఆర్థిక బలం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ అభ్యర్థులు ఆర్థికంగా అంతగా ఫిట్ గా లేరు. దాదాపు పదేళ్లకు పైగా పార్టీ అధికారానికి దూరంగా ఉంది. దీంతో ఇక ఉన్నంతలో కొందరిపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ ఐటీ, ఈడీ రైడ్స్ కు కారణం పీయూష్ గోయల్, కేటీఆర్ అంటూ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డబ్బులు అందజేయడమే కాదు.. బీఆర్ఎస్ తరుఫున ఓటర్లకు అధికారికంగా డబ్బులు పంచే కార్యక్రమానికి సైతం అనుమతిచ్చింది. బీజేపీ సహకరించకుంటే రైతు బంధు లాంటి పథకానికి నిధుల విడుదల సాధ్యం కానేకాదు. నిబంధనల ప్రకారం.. సాధారణంగా ఈసీ పోలింగ్ కు ముందు ఎలాంటి ప్రభుత్వ పథకాల అమలుకు అంగీకరించదు. పోలింగ్ ముగిసిన తర్వాతే.. కానీ ఇక్కడ పోలింగ్ కు ఐదు రోజుల ముందు ఈ పథకంలో భాగంగా నగదు జమ చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది.
కర్ణాటక తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంది. ఇక్కడ కూడా గెలిస్తే దేశ వ్యాప్తంగా ఎంపీ సీట్లపై వేటు పడుతుందని పరోక్షంగా బీఆర్ఎస్ కు బీజేపీ సహకరిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హంగ్ అయినా సరే తెచ్చుకుందామన్న తమ వ్యూహాలు కూడా పారకపోవడంతో శరణ్యం లేక బీఆర్ఎస్ ను ఆశ్రయించాల్సి వచ్చిందని విమర్శలు ఎదుర్కోంటోంది.