BJP : ఉగాది నాటికి బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడు

BJP

BJP

AP BJP : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఉగాది పండుగలోపు ఎప్పుడైనా ఈ ప్రకటన వెలువడవచ్చని పార్టీలోని ముఖ్య నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పలువురు సీనియర్ నాయకుల అభిప్రాయాలను పార్టీ అధిష్టానం సేకరించింది. బండి సంజయ్, రాంచందర్ రావు, లక్ష్మణ్, అర్వింద్, డీకే అరుణ, ఈటల రాజేందర్, పాయల శంకర్ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

TAGS