BJP Manifesto : తెలంగాణ బీజేపీ ఎన్నికల హామీలను ప్రకటించింది. రిజర్వేషన్లతో పాటు రైతులు, ఆధ్యాత్మికానికి సంబంధించి ప్రజలకు కీలక హామీలు ఇచ్చింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ పార్టీ..
-బీజేపీ కీలక హామీలు ఇవీ
* కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్న ఎరువుల సబ్సిడీ ఎకరానికి రూ.18 వేలతోపాటు చిన్న, సన్నకారు రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు 2 వేల 500 రూపాయల ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
-ప్రతి రైతుకు ఉచిత పంట బీమా అమలు చేయటం
వరికి 3 వేల 100 రూపాయల మద్దతు ధర
పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు
ఆసక్తి ఉన్న రైతులకు దేవీ ఆవులను ఉచితంగా అందించడం
జాతీయ పసుపు బోర్డు నిర్ణయానికి అనుగుణంగా నిజామాబాద్ టర్మరిక్ సిటీని అభివృద్ధి చేయటం
ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న రిజర్వేషన్లను పున:పరిశీలించి, గిరిజన వర్గాల రిజర్వేషన్లను జనాభాకు అనుగుణంగా పెంచేలా హామీ
ఎస్సీల్లో వెనకబడిన వారికి సాధికారత కల్పించేందుకు ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేయటం
ఇండోర్ తరహాలో పారిశుధ్య కార్మికులను వేతనాలు
ఏడాదికి ఫ్రీగా 4గ్యాస్ సిలిండర్లు
డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థినులకు ఉచిత ల్యాప్టాప్లు
నవజాత బాలికపై FD (21 ఏళ్లయ్యాక రూ.2లక్షలు)
ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితం
స్వయం సహాయక బృందాలకు 1% వడ్డీకే రుణాలు
మహిళా రైతుల కోసం మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు
మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు
UPSC తరహాలో 6 నెలలకోసారి TSPSC రిక్రూట్మెంట్
EWS కోటా, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల్లో భర్తీ