BJP In-Charges : సార్వత్రిక ఎన్నికలకు భారతీయన జనతా పార్టీ సన్నాహాలు చేస్తుంది. మోడీ ఛరిష్మా ఏ మాత్రం తగ్గకపోవడంతో ఈ సారి 400 సీట్ల వరకు ఆశిస్తున్నట్లు పార్టీలో అంతర్గతంగా చర్చలు మొదలయ్యాయి. అయితే ఇది కేవలం మాటలతోనే కాకుండా కృషి చేస్తేనే సాధించవచ్చని ఆ దిశగా సిద్ధం అవుతోంది. జనవరి 22వ తేదీ భవ్య రామ మందిరం ప్రారంభం అవుతుంది. ఈ క్రెడిట్ ను బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలంటే ముందస్తుకు వెళ్లక తప్పదు. ఈ దిశగానే కేంద్రం ఆలోచిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక తెలంగాణలో గతంలో ఉన్న సీట్లకు అదనంగా మరికొన్ని దక్కించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా పక్కా వ్యూహంతో వెళ్తుంది. లోక్ సభ సెగ్మెంట్లపై బూత్ కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ సెగ్మెంట్లకు ఇన్ చార్జిలను నిమించింది. దీనికి సంబంధించిన ప్రకటనను సోమవారం (జనవరి 8వ తేదీ) రిలీజ్ చేసింది.
ఇన్ చార్జుల వివరాలు..
అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ చార్జి
ఆదిలాబాద్ పాయల్ శంకర్
కరీంనగర్ ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా
పెద్దపల్లి రామారావు పటేల్
నిజామాబాద్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి
జహీరాబాద్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి
మెదక్ హరీష్ బాబు
మల్కాజ్‌గిరి పైడి రాకేశ్ రెడ్డి
సికింద్రాబాద్ డాక్టర్ కే లక్ష్మణ్
హైదరాబాద్ రాజాసింగ్
చేవెళ్ల వెంకట నారాయణ రెడ్డి
మహబూబ్‌నగర్ రామచందర్ రావు
నాగర్‌కర్నూలు రంగారెడ్డి
నల్లగొండ చింతల రామచంద్రా రెడ్డి
భువనగిరి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
వరంగల్ మర్రి శశిధర్ రెడ్డి
మహబూబాబాద్ గరికపాటి మోహన్ రావు
ఖమ్మం పొంగులేటి సుధాకర్ రెడ్డి
పార్టీలో కీలక నేతలైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించకపోవడం గమనార్హం.