Rahul Gandhi : బీజేపీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోంది: రాహుల్ గాంధీ

Rahul Gandhi
Rahul Gandhi : బీజేపీ ప్రభుత్వం ప్రజలను భయపెట్టడంతో పాటు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్ కోట్ కోటలో 35 అడుగుల శివాజీ విగ్రహం కుప్పకూలిన ఘటనను ఉద్దేశిస్తూ.. బీజేపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
‘‘ప్రజలను భయపెడుతూ, రాజ్యాంగాన్ని, ఆయా సంస్థలను నాశనం చేస్తూ.. ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఎదుట తలవంచి నమస్కరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. శివాజీ అందించిన సందేశం దేశమంతటికీ వర్తిస్తుంది. ఛత్రపతి, సాహు మహరాజ్ లాంటి యోధులు లేకపోయి ఉంటే నేడు మనకు రాజ్యాంగం ఉండేది కాదు’’ అని పీఎం మోదీని ఉద్దేశిస్తూ రాహుల్ వ్యాఖ్యానించారు.
TAGS Rahul Gandhi