JAISW News Telugu

Bit coin : శరవేగంగా పరుగెత్తిన బిట్ కాయిన్.. కారణాలివే

Bit coin

Bit coin

Bit coin : అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలో దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అన్ని లాభాల్లో పరుగులు పెట్టాయి. కాగా బిట్ కాయిన్ కూడా వేగంగా పరుగులు తీసింది. ట్రంపు గెలిచాడనే వార్త రాగానే బిట్ కాయిన్ అమాంతం పెరిగిపోయింది. ట్రంపు అమెరికా అధ్యక్షుడు అని తేలిపోగానే బిట్ కాయిన్ ధర 10 వేల డాలర్లకు పైగా ఎగబాకింది.63467 డాలర్లు గా ఉన్న బిట్ కాయిన్ ధర దాదాపు 73 వేల డాలర్లు దాటిపోయింది. కేవలం 12 గంటల్లోనే 10 వేల డాలర్లు పెరగడం విశేషం. ఇంతలా బిట్ కాయిన్ ధర ఎప్పుడూ పెరగలేదు. ఇలా పెరగడానికి కేవలం ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కావడం మాత్రమే అని బిజినెస్ రంగ నిపుణులు చెబుతున్నారు.

ఇది బిట్ కాయిన్ చరిత్రలో ఆల్ టైం రికార్డు ఈ ధర అని చెప్పొచ్చు.  2024 మార్చి నుంచి బిట్ కాయిన్ జోరు పెరుగుతూనే ఉంది. కానీ ఈ ఏడాది ప్రారంభంలో బిట్ కాయిన్ కేవలం 38 వేల డాలర్లు ఉంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంపు గెలవబోతున్నాడనే టాక్. అక్కడ తలెత్తిన పరిస్థితులు అన్ని ఇన్వెస్టర్లను క్రిఫ్టొ కరెన్సీ వైపు మళ్లించాయి. దీంతో అందరూ బిట్ కాయిన్లు కొనడం మొదలెట్టారు. దీంతో శరవేగంగా దూసుకుపోయింది. దీనికి తోడు ట్రంప్ కూడా అమెరికా ప్రెసిడెంట్ కావడం ఇన్వెస్టర్లకు కలిసి వచ్చింది.

క్రిప్టో కరెన్సీలుగా ఇథీరియం, టెథార్, సొలానా, బీఎన్‌బీ, డోజ్ కాయిన్, కార్డానో వంటి కాయిన్లు భారీ లాభాలు మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రంప్ స్నేహితుడు ఎలాన్ మస్క్ టెస్లా అధినేత మద్దతుగా ఉన్న డోజీ కాయిన్ ఏకంగా 24 గంటల్లోనే 16 శాతం పెరిగింది. దీనికి కారణం ట్రంపుకు ఎలాన్ మస్క్ మద్దతు ధర తెలపడమే.

Exit mobile version