Birds Divorce : పక్షుల్లోనూ ఎడబాటు.. కారణమెంటో తెలుసా..?
-
తొలి కలయికను గుర్తు తెచ్చుకొని ఫీలవుతున్న పక్షులు

Birds Divorce, Two Birds
Birds Divorce : సాధారణంగా మనుషులు వివిధ కారణాలు, చిన్న విషయాలు, లేదంటే ఈగో కారణంతో పాట్నర్ తో విడిపోతుంటారని తెల్సిందే. అయితే ఈ ట్రెండ్ అనేది ఇటీవలీ కాలంలో విపరతీతంగా పెరిగిపోవడం ఆందోళనను రేకెత్తిస్తోంది. చిన్న చిన్న మనస్పర్థలతో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరిగుతుందని సర్వేలు కూడా చెబుతున్నాయి. అయితే మనషులు మాదిరిగానే.. పక్షుల్లోనూ ఇది జరుగుతుందని తాజా ఓ అధ్యయనంలో వెల్లడయింది.
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 80 శాతం పక్షి జాతులు సమూహంగా నివసిస్తుంటాయి. పర్యావరణ ప్రభావం, వాతావరణ మార్పులు, ఆహారం దొరకపోవడం వంటి కారణాలతో పక్షులు ఆయా ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి. ఈ సందర్భంగా పక్షులు తమ మునుపటి భాగస్వాముల నుంచి విడిపోవడం, ఇతర ప్రదేశాల్లోని భాగ స్వాములతో జతకట్టడం జరుతుందని జర్మనీకి చెందిన పరిశోధకులు తేల్చారు.

Birds Divorce
సుదూర తీరాలకు వలస వెళ్లడం.. ఎక్కువ సమయం వేర్వురుగా ఉండడం. సంతానోత్పత్తి కోసం ఇతర పక్షులతో జతకట్టడం వంటి కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నాయని జర్మనీకి చెందిన పరిశోధనలు చెప్తున్నాయి. అయితే ఈ లాంగ్ డిస్టెన్స్ మైగ్రేషన్ కారణంగా పక్షులు తమ తొలి కలయికలను గుర్తు తెచ్చుకొని ఎడబాటును ఫీలవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అధ్యాయనంలో భాగంగా 233 పక్షి జాతులకు సంబంధించిన వలసలు, మేటింగ్ బిహేవియర్ డేటాను వారు ఎనలైజ్ చేశారు.
ఏదిఏమైనా మనుషుల మాదిరిగానే పక్షులు సైతం తమ భాగస్వామి(పార్టనర్)ను తలుచుకొని ఫీలవుతుండటం చూస్తుంటే.. బాధ అనేది మనిషికైనా.. పక్షికైనా ఒకటేనని అర్థమవుతోంది.