Bill Gates : కూతురు స్టార్టప్ కు రూపాయి పెట్టని బిల్ గేట్స్.. భయపడ్డాడట..

Bill Gates : టెక్ ప్రపంచాన్ని మార్చిన దిగ్గజం బిల్ గేట్స్ తన కుమార్తె ఫీబీ ప్రారంభించిన స్టార్టప్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఫీబీ తన రూమ్‌మేట్‌తో కలిసి ఈ-కామర్స్ రంగంలో ‘ఫియా’ అనే ఏఐ ఆధారిత బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌ను రూపొందించారు. మొదట ఆమె పెట్టుబడి కోసం డబ్బులు అడుగుతుందేమోనని గేట్స్ కాస్త ఆందోళనకు లోనయ్యారు. ఫీబీ అడగలేదు కాబట్టి, తాను కూడా తగిన రిలీఫ్ పొందానని గేట్స్ తెలిపారు. తన కూతురికి స్వేచ్ఛనిచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఫీబీకి స్టార్టప్ నడిపే జీవిత పాఠాలు నేర్చుకోవడంలో తల్లి మెలిండా గేట్స్ పెద్ద మద్దతుగా నిలిచారని కూడా వెల్లడించారు.

TAGS