Shivaji Daughter : శివాజీ కూతురుతో యావర్ రొమాన్స్.. ఇదేమి పొయ్యే కాలం అంటున్న నెటిజెన్స్!

Shivaji Daughter

Shivaji Daughter, Nayani Pavani

Bigg Boss Shivaji Daughter : గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 7 లో అందరికంటే తక్కువ రోజులు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది కిరణ్ రాథోడ్ తర్వాత నయని పావని అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన పావని మొదటి వారం లోనే ఎలిమినేట్ అవ్వడం హౌస్ లో ఉన్న అందరికి బాధని కలిగించింది. ఎందుకంటే పావని ఉన్న ఆ కొద్దిరోజుల్లోనే హౌస్ లో అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది.

టాస్కులు కూడా చాలా మంది కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఆమె చాలా బెటర్ గా ఆడింది. అందుకే ఆమె హౌస్ నుండి బయటకి వెళ్తుంటే ప్రతీ ఒక్క కంటెస్టెంట్ బాగా ఏడ్చారు. ఇంకొక్క అవకాశం ఈ అమ్మాయికి ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అని అందరికీ అనిపించింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఈమె స్పై బ్యాచ్ తోనే ఎక్కువ గడిపింది.

Nayani Pavani and Yavar

Nayani Pavani and Yavar

ముఖ్యంగా శివాజీని అయితే తన సొంత తండ్రిలాగా భావించింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు అలాగే భావించింది , హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా శివాజీ ని మా నాన్న అంటూ చెప్పుకొని తిరిగింది. అలాగే యావర్ తో కూడా ఈమె చాలా క్లోజ్ గా ఉండేది. హౌస్ లో కొన్ని రోజులు ఈమె కొనసాగి ఉంటే కచ్చితంగా యావర్ తో ప్రేమాయణం నడిపేది అని చాలా మందికి అనిపించింది. ఇక బయటకు వచ్చిన తర్వాత వీళ్లిద్దరి రొమాన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజెన్స్. ఇంస్టాగ్రామ్ లో సమయం దొరికితే ఇద్దరు డ్యూయెట్స్ పాడుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఉన్నారు. రీసెంట్ గా సోషల్ మీడియా లో వీళ్లిద్దరు కలిసి చేసిన ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాట రీల్ తెగ వైరల్ గా మారింది.

దీనిని చూసిన ప్రతీ ఒక్కరు, శివన్న చూసావా మీ కూతురు ఎలా ఉందో అంటూ ఇంస్టాగ్రామ్ లో శివాజీ ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్క పాటతో వీళ్ళు వదిలేయలేదు, టాలీవుడ్ లో టాప్ రొమాంటిక్ సాంగ్స్ చాలా వరకు రీల్స్ చేసుకుంటూ కనిపించారు. దీనిని చూసిన నెటిజెన్స్ విషయం చాలా దూరం వెళ్లినట్టు ఉంది, ఇక ఆపేయండి చూడలేక చస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

TAGS